షూటింగ్ కు వెళ్లకుండానే పుష్ప పాటలు రెడీ

0

అల్లు అర్జున్ ఈ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం పాటలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. థమన్ అందించిన సంగీతం సినిమా స్థాయిని అమాంతం పెంచడంతో పాటు సినిమాలో పాటలు ప్లస్ గా నిలవడం వల్ల సినిమా హిట్ అయ్యింది. ఆ విషయాన్ని త్రివిక్రమ్ మరియు బన్నీ కూడా ఒప్పుకున్నాడు. సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా పాటలు ప్రముఖ పాత్ర పోషించాలి అనేది అందరి అభిప్రాయం.

బన్నీ ప్రస్తుతం చేసేందుకు రెడీ అవుతున్న పుష్ప సినిమా పాటల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాటలు హిట్ అయితే సినిమా సగం వరకు హిట్ అయినట్లే అంటారు. అందుకే పాటల విషయంలో ఒకటికి రెండు సార్లు మూడు సార్లు పరిశీలిస్తున్నారట. దానికి తోడు కరోనా కారణంగా సమయం చాలా ఎక్కువగా వచ్చింది. అందుకే పుష్ప పాటలను దాదాపుగా నాలుగు అయిదు నెలలుగా బన్నీ మరియు సుకుమార్ లు దేవిశ్రీతో చేయిస్తున్నారు.

పాటలు అన్ని కూడా ఎన్నో మార్పులు మరియు చేర్పులు చేసి మరీ రెడీ చేయించారట. సినిమా ఆల్బం మొత్తం దాదాపుగా పూర్తి అయ్యిందని దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన కెరీర్ బెస్ట్ ఇచ్చాడంటూ టాక్ వినిపిస్తుంది. సుకుమార్.. దేవిల కాంబోలో పలు సూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బంలు ఉన్నాయి. కనుక ఈ సినిమా కూడా తప్పకుండా సంగీతం పరంగా ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.