2020 వచ్చే సరికి సెక్సువల్ రిలేషన్లు ఇలా మారాయా?

0

కాలానికి తగ్గట్టు సమాజం లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఎవరు ఔనన్నా కాదన్నా ఆ మార్పులు ఆగవు. గతంలో ఉమ్మడికుటుంబాలు ఉండేవి. విడిగా ఉంటే వింతగా చూసేవారు. ఇప్పుడు సమాజం ఎలా మారింది అంటే ఎవరైనా ఉమ్మడికుటుంబంలో ఉన్నాం అని చెప్తే అదోరకంగా చూస్తారు. ఇలాంటివే కాదు చాలా విషయాలలో ఊహించలేనంతగా మార్పులు వచ్చాయి. ఇంటర్నెట్ విప్లవం.. సామాజిక మాధ్యమాల విస్తృతి కారణంగా మానవ సంబంధాలలో కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది.

సెక్సువల్ రిలేషన్ల విషయమే తీసుకుంటే గతంలో వ్యభిచారం.. అక్రమ సంబంధాలు అనేవి మహా పాపాలుగా చూసేవారు. ఇప్పుడు కూడా అలానే చూస్తున్నారు కానీ అవన్నీ చాలా సాధారణం అయ్యాయి. వావివరసలు లేకుండా ప్రవర్తించడం.. వయసు తేడాలు లేకుండా మనసు ముఖ్యం అనుకోవడం కూడా ఇప్పుడు సాధారణంగా మారుతోంది. కాలానుగుణంగా మారిన పరిస్థితులలో ఇలా వయసు తేడాలు మర్చిపోయి మరీ ప్రవర్తించేవారు ఎక్కువ అవుతున్నాయి. యాభై పై బడిన మగవారు ఇరవైల అమ్మాయిలతో డేటింగ్ చెయ్యడం.. వివాహం చేసుకోవడం కామన్ గా మారుతోంది. బాలీవుడ్ లో సగం మంది హీరోలు ఇదే బాపతు.

ఇక యాభైల మహిళలు పాతిక ముప్పై ఏళ్ళ కుర్రాళ్ళతో ప్రేమాయణాలకు.. రాసలీలకు సైసై అంటున్నారు. ఉదాహరణ కు మలైకా అరోరా-అర్జున్ కపూర్ ప్రేమాయణం. చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఈమధ్య ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో 60 ఏళ్ళ మహిళ 22 ఏళ్ళ కుర్రాడి ప్రేమలో మునిగిపోయింది. అమ్మమ్మ- అబ్బాయ్ ప్రేమ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇదిలా ఉంటే వావివరసలు కూడా అర్థం కాకుండా కొందరు ప్రవర్తిస్తున్నారు. ఇది కూడా పేపర్ల లో ఈమధ్య వచ్చిన వార్తే. ఒక పెళ్ళి సంబంధం ఫిక్స్ అయింది. సరిగ్గా పెళ్ళికి ముందు అమ్మాయి తండ్రి.. అబ్బాయి తల్లి జంప్. నిజానికి వారు తమ యూత్ లో లవర్స్ అట. ఇప్పుడు తమపిల్లలు పెళ్ళి చేసుకోబోతుంటే తమ ప్రేమ చిగురులు తొడిగింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక చాలామంది సంప్రదాయవాదులు జుట్టుపీక్కొని ఉంటారు. ఇక సరదావాదులు పగలబడి నవ్వుకుని ఉంటారు.

ఇక డేటింగ్ వెబ్ సైట్ల పుణ్యమా అని.. సోషల్ మీడియాలో కనెక్షన్స్ పెంచుకోవడం సులువు కావడంతో వయసు తేడాలు లేకుండా సెక్సువల్ పార్ట్నర్ లను వెతుక్కుంటూ ఉన్నారు. శృంగార సామ్రాజ్యంలో ఓలలాడుతున్నారు. ఇవన్నీ మాకు తెలియవు అని అంటే మీరు సత్తెకాలపు సత్తెయ్యలే. ఒక్కసారి టిండర్ లాంటి డేటింగ్ యాప్ ల గురించి గూగుల్ లో శోధన చేస్తే అప్పుడు గానీ మీకు తత్త్వం బోధపడదు. మన చుట్టూ సమాజం మనం ఊహించనంతగా మారిపోయి ఉంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-