యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Rare Pics.

అదే పనిగా పిల్లలు స్మార్ట్ ఫోన్లు చూస్తే ఈ ప్రమాదం తప్పదంటున్న నిపుణులు !!

0

స్మార్ట్ ఫోన్స్ తో ఎంత మంచి ఉందొ అంతే చెడుకూడా ఉంది. తెలిసీ తెలియని పసి వయసు నుంచే పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తుంటే…వారి చేతికి ఒక గ్రాము కొకైన్ ఇస్తున్నట్లేనని మానసిక శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. చిన్న పిల్లల మీద జరిగిన ఓ సర్వేలో స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వినియోగిస్తున్న చిన్నారుల్లో ఆలోచన శక్తి క్షీణిస్తున్న ట్లు తెలిసింది. కొంతమంది తల్లిదండ్రులు తమ పనికి పిల్లలు అడ్డు గా లేకుండా, అల్లరి చేయకుండా ఒక చోట కూర్చోవాలనే ఆలోచన తో స్మార్ట్ ఫోన్లు పిల్లల చేతికి ఇస్తున్నట్లు తేలింది.ఇక ఫోన్ లో మునిగి పోతున్న పిల్లలు శారీరకంగా ఆడవలసిన ఆటలకు దూరమై స్మార్ట్ ఫోన్లు కు బానిసలుగా మారుతున్నారు. ఇది మానసిక సమస్యల నే కాకుండా శారీరక సమస్యలు కలిగిస్తుందని ఆందోళన చెందుతున్నారు.

అయితే రోజుకు సగటున 5 గంటల సమయం వీటిలో గడిపేవారు మానసికంగా కృంగుబాటు కు గురవుతున్నారు అని తెలుస్తుంది. దీంతో వారికి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కలుగుతుందట. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోందని శాన్‌డిగో స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన బృందం చేపట్టిన ఓ పరిశోధనలో బయట పడింది. యూనివర్సిటీకి చెందిన కొందరు నిపుణులు,14 ఏళ్ల లోపు వయసున్న సుమారు లక్షా ముప్పై వేల మంది అమ్మాయిలను పరీక్షించగా వారికి ఆశ్చర్యాన్ని కలిగించే నిజాలు తెలిశాయి.
సోషల్ మీడియా కోసం అమ్మాయిలు వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. తాము పెట్టిన పోస్టులకు, ఫొటోలకు ఎన్ని లైక్స్‌, కామెంట్స్‌ వచ్చాయి, ఎందరు ఫాలో అవుతున్నారు ఇలాంటి అంశాలను గమనించటానికి ఎక్కువ సమయం పెడుతున్నారట. వారు అనుకున్న స్పందన లభించకపోతే తీవ్ర నిరాశ చెందుతున్నారు. దీనితో పాటు ఇతరులను ఎక్కువగా ఆకర్షించే లే పోతున్నామే అన్న బాధకు లోనవుతున్నారు. దీంతో మానసికంగా కృంగుబాటు కు గురయి.. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కు పునాది వేసుకుంటున్నారు. అసలు విరామం అనేది లేకుండా యూట్యూబ్‌ వీడియోలను అదే పనిగా చూస్తే ఈ ప్రమాదం మరింత ఎక్కువవుతుంది అని నిపుణులు తెలియచేస్తున్నారు. అబ్బాయిలతో పోల్చి చుస్తే అమ్మాయిలే స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగావాడుతున్నట్లు ఈ అధ్యయనం బయట పెట్టింది. పిల్లలకు టెక్నాలజీని పరిచయం చేయడంలో తప్పు లేదు కానీ వాటికీ హద్దులు చెప్పకుండా బానిసలుగా మార్చి తేనే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

పిల్లలు ఎక్కువ సేపు ఫోన్లతో ఉండకుండా చూడాలని చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ల వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనేది వారికి అర్థమయ్యేలా తల్లిదండ్రులు వివరించి చెప్పాలని తెలియచేస్తున్నారు. అతి ముఖ్యంగా 1 నుంచి 15 ఏళ్ల లోపు చిన్నారులు ఫోన్ తో గడపడం వలన ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుంది అని తెలియ చేస్తున్నారు.