Eatala Rajender: ఫైలెట్ అప్రమత్తతో ఈటల బృందానికి తప్పిన పెను ప్రమాదం..!!

0

Eatala Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బృందానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బీజేపీలో చేరేందుకు నిన్న ఈటల బృందం ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రుల సమక్షంలో ఈటల బృందం బీజేపీలో చేరింది. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణించే ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫైలెట్ అప్రమత్తం అయ్యారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. టేకఫ్ సమయంలో రన్ వేపై పైలెట్ సాంకేతిక సమస్యను గుర్తించారు.

ఈ ప్రత్యేక విమానంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఎమ్మెల్యే రఘునందనరావు, బీజేపీ నేతలు వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమా తదితర నేతలు, కార్యకర్తలు 184 మంది ఉన్నారు.