Templates by BIGtheme NET
Home >> Cinema News >> Faria Abdhullah: మరో కామెడీ ఎంటర్టైనర్ లో జాతిరత్నాలు హీరోయిన్..!!

Faria Abdhullah: మరో కామెడీ ఎంటర్టైనర్ లో జాతిరత్నాలు హీరోయిన్..!!


Faria Abdhullah: అందాల హైదరాబాదీ అమ్మడు ఫరియా అబ్దుల్లా యూట్యూబర్ గా అందరికీ సుపరిచితమే.. జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకి పరిచయమైంది ఫరియా అబ్దుల్లా.. ఈ సినిమాతో చిట్టి గా అందరి మనసులను దోచుకున్న ఈ భామ.. ఈ చిత్రంతో వరుస ఆఫర్లు అందుకుంటుంది.. ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ ఢీ సీక్వెల్లో నటించే అవకాశం అందుకున్నట్లు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది ఈ వార్త..!!

ప్రస్తుతం మంచు విష్ణు, శ్రీను వైట్ల దర్శకత్వంలో డీ సీక్వెల్ లో నటించనున్న సంగతి తెలిసిందే.. ‘డీ అండ్ డీ’ టైటిల్ తో సిద్ధమవుతున్న ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత సెట్స్ పైకి రానుందని తెలుస్తోంది.. ఈ చిత్రం తో ఎలాగైనా హిట్ కొట్టాలని విష్ణు ఫిట్నెస్ లో కూడా మార్పులు చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా బాగుంటుందని మంచు విష్ణు సజెస్ట్ చేయగా, శ్రీనువైట్ల కూడా వెంటనే ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ చిత్ర బృందం ఫరియా ను సంప్రదించగా ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.