రష్యా సంచలనం: గాల్వాన్ ఘటనలో 45 మంది చైనా సైనికుల మృతి

0

గత ఏడాది జులైలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు కారణమైంది. ఏడాదిగా రెండు దేశాల సరిహద్దుల్లో ఆ వేడి కొనసాగుతోంది. ఇప్పటికే సుమారు 50వేల మంది సైనికులు సరిహద్దుల్లో కాపు కాస్తున్నారు.

గల్వాన్ లో గత ఏడాది జూన్ లో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు చనిపోయారని అప్పుడే భారత ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. వారికి నివాళులర్పించి ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించింది. అయితే చైనా దేశం మాత్రం ఈ ఘర్షణల్లో ఎంత మంది సైనికులు చనిపోయారన్నది మాత్రం ఇప్పటికీ వెల్లడించలేదు.అయితే ఘర్షణల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న మన సైనికులు మాత్రం చైనాకు చెందిన 30మంది చనిపోయి ఉండొచ్చని చెప్పుకొచ్చారు.

కానీ తాజాగా రష్యా ప్రభుత్వానికి చెందిన అధికారిక న్యూస్ ఏజెన్సీ సంచలన కథనాన్ని ప్రచురించింది. గల్వాన్ లో భారత సైనికులతో జరిగిన ఘర్షణలో 45 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా న్యూస్ ఏజెన్సీ బాంబు పేల్చింది. ఈ దాడిలో 20 మంది భారత సైనికులు మరణించినట్లు పేర్కొంది. వీటిపై అమెరికాతోపాటు అప్పట్లో వచ్చిన కొన్ని ఇంటెలిజెన్స్ నివేదికలను రష్యా సంస్థ చూపించింది.