విశాఖను భయపెడుతున్న కొత్త వైరస్

0

ఓ వైపు కరోనా కోరలు చాస్తోంది. మరో వైపు వానాకాలం రోగాలు పట్టిపీడిస్తున్నాయి. వీటితోనే జనాలు అల్లాడుతుంటే విశాఖలో మరో కొత్త వైరస్ విజృంభిస్తోంది.

తాజాగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ తో జనాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్ ప్రభావం మొదలైందని తెలుస్తోంది.

విశాఖ ఏజెన్సీల్లో స్కృబ్ టైఫస్ అనే వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కొత్త వైరస్ సోకితే ముందుగా జ్వరం శరీరంపై దద్దుర్లు వస్తాయని అంటున్నారు. తాజాగా విశాఖ ఏజెన్సీలో ముగ్గురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు. కరోనాగా భావించి టెస్టులు చేయగా ఈ కొత్త వైరస్ గా తేలిందని సమాచారం.

ఏజెన్సీలో సాధారణంగా వానాకాలంలో వ్యాధులు ప్రబలుతుంటాయి. కానీ ఈ వైరస్ పై వైద్యులు అధ్యయనం చేయగా.. స్కృబ్ టైఫస్ అని తేలింది.

ఈ వైరస్ ను ముందుగానే గుర్తిస్తే యాంటి బయాటిక్ ఇంజక్షన్ తో నయం చేయవచ్చనని ఆలస్యమైతే దీని ప్రభావం శరీరంపై తీవ్రంగా ఉంటుందని .. ఇది అంటు వ్యాధని వైద్యులు తెలిపారు. ఒకరినుంచి మరొకరికి ఇది సోకుతుందని వివరించారు. కరోనా టైంలో ఈ కొత్త వైరస్ లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.