Templates by BIGtheme NET
Home >> Telugu News >> తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం హైలైట్స్ !

తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం హైలైట్స్ !


తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టంతో రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖలో సమూల ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. భూ నిర్వహణలో సరళీకృత అవినీతిరహిత బలహీనులకు మేలు చేసే విధంగా ఈ కొత్త చట్టాన్ని రూపొందింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త రెవెన్యూ చట్టం కింద తెచ్చిన 5 చట్టాల గురించి అనేక కీలక విషయాలను కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న భూమి రికార్డులకు సంబంధించిన చట్టాల స్థానంలో 5 చట్టాలను తెచ్చారు. ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్ బిల్ 2020 ది తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ది ఫోస్ట్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ బిల్ 2020 ది తెలంగాణ పంచాయితీ రాజ్ ఎమెండ్మెంట్ బిల్ 2020 ది తెలంగాణ మునిసిపల్ లాస్ ఎమెండ్మెంట్ బిల్ 2020 జీహెచ్ఎంసీ చట్టం…వీటిని కొత్తగా తెచ్చారు.

పాత రికార్డుల స్థానంలో ‘ధరణి’ వెబ్ సైట్ రానుంది. వ్యవసాయ భూములువ్యవసాయేతర భూములకు సంబంధించి విడిగా వివరాలుంటాయి. ఈ వెబ్ సైట్ లొని సమాచారం అందరూ చూడవచ్చు. కాపీ డౌన్లోడ్ చేయవచ్చు. ఇకపై తహశీల్దారు నుంచి జాయింట్ కలెక్టర్ వరకూ ఎవరికీ విచక్షాణాధికారాలుండవు. వీలైనన్ని సేవలు ఆన్లైన్లోనే కావడంతో నేరుగా ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. భూములపై వచ్చిన వివాదాలపై కోర్టు తీర్పులను కూడా ఆన్లైన్ రికార్డుల్లో అప్డేట్ చేస్తారు. ఇకపై రిజిస్ట్రేషన్ తో పాటూ మ్యుటేషన్ కూడా జరుగుతుంది. తహశీల్దార్లందరికీ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా ఇవ్వనుండడంతో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు ఇకపై సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్లే పనిలేదు. తహశీల్దార్ల ఆఫీసుల్లోనే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ధరణి వెబ్ సైట్లో అప్డేట్ ఒకేసారి జరుగుతాయి.

విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (విఆర్ఒ) వ్యవస్థను రద్దు చేసి వారిని వేర్వేరు శాఖల్లో సమాన స్థాయిలో ఉద్యోగులుగా సర్దుబాటు చేస్తారు. ఇకపై వీఆర్వోల పనిని టెక్నాలజీ సాయంతో నడపనున్నారు. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ లనూ వేరే శాఖల్లో సర్దుబాటు చేస్తారు. అవసరమైన వీఆర్వో వీఆర్ టీలను రెవెన్యూ శాఖలో కంటిన్యూ చేస్తారు. ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్ట్రార్లు ప్లాట్లు ఇళ్లు అపార్టుమెంట్లు కంపెనీల స్థలాలు.. గ్రామ కంఠం(ఆబాదీ) వంటి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లుమ్యుటేషన్లు చేయనున్నారు. ఈ రిజిస్ట్రేషన్ కి సమయం కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. దస్తావేజులు సొంతంగా తయారు చేసుకోవచ్చు లేదంటే లేఖరి (దస్తావేజు రాసేవారు) చేత రాయించుకోవచ్చు. ఇకపపై డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు తప్పనిసరి. ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ (ఈసీ) వివరాలు వెబ్ సైట్లో చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయకూడని భూములను ఆన్ లైన్లో ఆటో లాక్ చేస్తారు. వారసత్వ భూమికి సంబంధించి విచారణతో నిమిత్తం లేకుండా కుటుంబం అంతా సంతకాలు పెడితే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తారు.

ఇకపై పట్టాదారు పాస్ పుస్తకాల్లో కుటుంబ సభ్యులు వివరాలన్నీ పెట్టడం వల్ల వివాదాలు రావు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరోసారి భూ సర్వే జరుపబోతోంది. ప్రతీ సర్వే నంబరుకూ అక్షాంశాలూ రేఖాంశాలూ (లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్) ఉండడంతో వివాదాలుండవు.
ఇప్పటివరకు ఉన్న రెవెన్యూ కోర్టులను రద్దు చేసి వాటి స్థానంలో ఫాస్ట్రాక్ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తున్నారు. పాత కేసులన్నీ ఫాస్ట్రాక్ కు బదిలీ అవుతాయి. ఇకపై వచ్చే వివాదాలపై సివిల్ కోర్టులకు వెళ్లాల్సి ఉంటుంది. ఇకపై కుల ధృవీకరణ సర్టిఫికెట్లను తహశీల్దార్ ఆఫీసులకు బదులుగా లైఫ్ టైం ఉపయోగపడేలా గ్రామ పంచాయితీ మునిసిపాలిటీలు జారీ చేయనున్నాయి. ఆదాయ సర్టిఫికెట్లుకూడా ప్రభుత్వ డాటా ఆధారంగా ఆన్లైన్లో ఇస్తారు