ఈ పెయింట్ వేసుకుంటే ఏసీలు అవసరం లేదు..

0

ఈ మధ్యకాలంలో ఏసీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సాప్ట్వేర్ కార్యాలయాలతో పాటు సాధారణ ప్రైవేట్ ఆఫీసుల్లోనూ ఏసీలు కామన్ అయిపోయాయి. ఎండకు తట్టుకోలేక మధ్యతరగతి ప్రజలు కూడా ఏసీలు పెట్టించుకుంటున్నారు. అయితే ఈ ఏసీలు విడుదల చేసే విషవాయువుల వల్ల ఓజోన్ పొర దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నారు. మరోవైపు విద్యుత్బిల్లులు కూడా అధికంగా వస్తుండటంతో మధ్యతరగతి ప్రజలు లబోదిబో అంటున్నారు.

ఈ నేపథ్యంలో యూఎస్లోని ఇండియానాకు చెందిన పర్డ్యూ యూనివర్సిటీ ఓ కూల్పెయింట్ను తయారు చేసింది. ఇంటికి ఈ పెయింట్ వేసుకుంటే ఉష్ణోగ్రత సాధారణం నుంచి 7.8 డిగ్రీలకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే పలు కూల్పెయింట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం తయారుచేయబోతున్న పెయింట్ సాధారణ పెయింట్ల కంటే ఎన్నోరెట్లు ఎక్కువ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పెయింట్ వేసుకున్నప్పుడు ఇంట్లోకి సూర్యరశ్మి వేడి చొరబడలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏడేళ్లు కష్టపడి అనేక ప్రయోగాలు చేసి ఈ పెయింట్ను తయారుచేసినట్టు చెప్పారు.