అలల మద్య ఎగసి పడుతున్న ప్రగ్యా అందం

0

కంచె సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రగ్యా జైస్వాల్ మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు తన అందంతో వావ్ అనిపించుకుంది. మొదటి సినిమాలో పద్దతి అయిన పాత్రలో కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత తర్వాత కాస్త గ్లామర్ రోల్ లు చేస్తూ వచ్చింది. అయినా కూడా ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. తెలుగులో అడపా దడపా ఆఫర్లు వస్తున్న ఈ సమయంలో వేరే భాషల్లో కూడా సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది.

సినిమాల్లో బిజీ అవ్వడం కోసం ఫిల్మ్ మేకర్స్ తన అందాలను పదే పదే చూపించే ప్రయత్నంలో భాగంగా సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ తన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈసారి ఈ అమ్మడు ఒక బీచ్ లో స్పోర్ట్స్ బ్రా ధరించి నాభి అందాలను చూపిస్తూ ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రగ్యా వెనుక ఉన్న అలల కంటే ఆమె అందాలు మరింతగా ప్రేక్షకుల హృదయాల్ల అలజడి రేపుతున్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.