Templates by BIGtheme NET
Home >> Telugu News >> గూగులమ్మకు రూ.73 లక్షల కోట్ల ఫైన్.. ఎందుకంటే?

గూగులమ్మకు రూ.73 లక్షల కోట్ల ఫైన్.. ఎందుకంటే?


ప్రముఖ సెర్చ్ఇంజిన్ గూగుల్కు అమెరికా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సెర్చ్ యాడ్స్ విషయం లో గూగుల్ యాంటీట్రస్ట్ చట్టాన్ని బ్రేక్ చేసిందని అమెరికా ఆరోపిస్తున్నది. అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దావా వేసింది. ఈ దావాకు కాలిఫోర్నియా డెమొక్రాట్ రాష్ట్ర అటార్నీ జనరల్ కూడా మద్దతు ఇచ్చారు. గూగుల్ 1 ట్రిలియన్ డాలర్లు. (రూ.7373830 కోట్లు) ఫైన్ వేయాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి.

ఈ ఆరోపణలను గూగుల్ ఖండించింది. తాము వినియోగ దారులను ప్రభావితం చేయడం లేదని స్పష్టం చేసింది. యాడ్స్ విషయంలో సెర్చ్ విషయంలో వినియోగదారుల అభిప్రాయాలు రోజుకో రీతిగా మారుతుంటాయని.. వారిని మేము ప్రభావితం చేయడం లేదని స్పష్టం చేసింది. మరోవైపు ఈ కేసుపై తాము కోర్టులో పోరాడతామని కూడా స్పష్టం చేసింది. మరోవైపు ఈ కేసుపై విచారణ కొనసాగుతుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

డిసెంబర్ 18న గూగుల్ ప్రతినిధులు విచారణ కు హాజరు కావాలని అమెరికా జిల్లా జడ్జి అమిత్ మెహతా ఆదేశించారు. గూగుల్ పై ఇటువంటి ఆరోపణలు కొత్తకాదు. గతంలోనూ వచ్చాయి. గూగుల్ సంస్థ వినియోగదారుల అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నదని గతంలో బ్రిటన్ కూడా ఆరోపించింది. ఈ విషయంపై బ్రిటన్లోనూ కేసు నడుస్తోంది. ఓ ప్రముఖ సంస్థపై వరసగా ఓకే రకమైన ఆరోపణలు రావడం గమనార్హం.