బబితాకు బాబు పుట్టాడోచ్..!

0

ప్రముఖ రెజ్లర్ బబితా ఫోగట్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొత్త ఏడాది ఆరంభం క్రీడాకారులకు కొత్త జోష్ నింపుతున్నది. రీసెంట్గా అనుష్క-విరాట్ దంపతులకు అమ్మాయి పుట్టిన విషయం తెలిసిందే. తాజాగా బబితకు బాబు పుట్టాడు. అయితే ఇవి మా జీవితంలో మధుర క్షణాలు అంటూ బబితా ఫోగట్ భర్త.. వివేక్ సుహాగ్ పేర్కొన్నారు. మేము తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందడం చాలా థ్రిల్లింగ్ ఉందని వివేక్ పేర్కొన్నారు.

‘మా కలలు సాకారమయ్యాయి.’ అంటూ బబితా ట్వీట్ చేశారు. బబిత ఆమె భర్త కుమారుడితో కలిసి ఉన్న ఫొటోను ఆమె షేర్ చేసుకుంది. హర్యానా కు చెందిన బబితా.. ప్రముఖ భారతీయ మహిళా కుస్తీ క్రీడాకారిణి. 2010 కామన్ వెల్త్ క్రీడల్లో రజత పతకం గెలుచుకున్నది. 2012 ప్రపంచ కుస్తీ చాంపియన్ షిప్ క్రీడల్లో ఆమెకు కాంస్య పతకం కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతకం వచ్చింది.

కామన్ వెల్త్ క్రీడల్లో మొట్టమొదటిసారి బంగారు పతకం గెలిచిన మహిళా కుస్తీ క్రీడాకారిణి గీతా ఫోగట్ చెల్లెలు మాజీ కుస్తీ క్రీడాకారుడు మహవీర్ సింగ్ ఫోగాట్ కుమార్తె. దీంతో కంగ్రాట్స్ బబితా అంటూ ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇటీవలే అనుష్క-విరాట్ దంపతులకు పాప పుట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా విరాట్ కొహ్లి ఇన్ స్టా వేదికగా వెల్లడించారు.