Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఎన్టీఆర్ కు `భారతరత్న` ఇవ్వాల్సిందే.. `మహానాడు` తీర్మానం

ఎన్టీఆర్ కు `భారతరత్న` ఇవ్వాల్సిందే.. `మహానాడు` తీర్మానం


మహానటుడు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్)కు భారత రత్న ఇవ్వా ల్సిందే- అని టీడీపీ నిర్వహించే పసుపు పండుగ సందర్భంగా నాయకులు తీర్మానం చేశారు. ఏటా మే 27 28 29 తేదీల్లో అత్యంత ఘనంగా నిర్వహించే మహానాడుకు చాలా ప్రత్యేకత ఉంది. అన్నగారు ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 28ని పురస్కరించుకుని.. పార్టీ భవిష్యత్తుపై తీర్మానంతోపాటు.. పార్టీ పరిస్థితిపై చర్చించు కునే ఈ కార్యక్రమానికి ఎనలేని ప్రాదాన్యం ఉంది.

అయితే.. గడిచిన ఏడాది సహా ఇప్పుడు కూడా మహానాడు నిర్వహణపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింద నే చెప్పాలి. దీంతో గత ఏడాది ఈ ఏడాది కూడా కేవలం రెండు రోజులకే మహానాడును పరిమితం చేయడం గమనార్హం. డిజిటల్ మాధ్యంలో సాగుతున్న మహానాడుకు.. ఇరు రాష్ట్రాల్లోని పార్టీ కీలక నాయకులు ఆన్లైన్ వేదికగా అనేక అంశాలపై చర్చించారు. శుక్రవారం ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని.. ఆయనకు ఘన నివాళులర్పించిన నాయకులు.. భారతరత్న వంటి గొప్ప అవార్డును ఎన్టీఆర్కు ఇచ్చి తీరాలని తీర్మానం చేశారు.

వాస్తవానికి గడిచిన మూడు నాలుగేళ్లుగా ఈ విషయంపై తీర్మానం చేస్తున్నారు. అయితే.. ఈ దఫా మాత్రం ఇటు రాజ్యసభ అటు లోక్సభలోనూ ఒత్తిడి తీసుకువచ్చి.. అన్నగారికి భారత రత్న సాధించి తీరాలని తాజాగా చేసిన తీర్మానంలో పేర్కొనడం గమనార్హం. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా కృషి చేయాలని.. ప్రతి విషయంలోనూ ఆచి తూచి వ్యవహరించాలని కూడా పార్టీ నేతలు నిర్ణయించారు.

పార్టీలో ప్రతి ఒక్కరికీ గుర్తింపు లభించేలా.. పార్టీని మున్ముందు.. మరింత స్పీడుగా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా చేయాలని కూడా మహానాడులో తీర్మానం చేయడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ప్రజల్లో పార్టీపై ఉన్న సానుభూతిని మరింత ఇనుమడింప జేసుకునేలా వ్యవహరించాలని నిర్ణయించారు. డిజిటల్ మాధ్యమం లో సాగుతున్న మహానాడు.. కేవలం రెండు రోజులకే పరిమితం కానుంది.