భర్తపై తన లిప్ స్టిక్ గుర్తులను నెమరేసుకుంటున్న హీరోయిన్

0

బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన కంటే చాలా చిన్నవాడు అయిన అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరి వివాహం సమయంలో చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. హాలీవుడ్ లో స్థానం కోసం.. అతడి డబ్బు కోసం నిక్ ను ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకుంది అనే ఆరోపణలు వినిపించాయి. ఇంకా చాలా చాలా రకాల ట్రోల్స్ ను కూడా ప్రీయాంక ఎదుర్కొంది. వీరిద్దరు ఎక్కువ కాలం కలిసి ఉండటం కష్టమే అనుకున్నారు. వాటన్నింటికి చెక్ పెట్టింది ప్రియాంక చోప్రా.

పెళ్లి అయ్యి దాదాపుగా రెండున్నర సంవత్సరాలు అవుతున్నా కూడా ఇద్దరి మద్య ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఇద్దరు కూడా రెగ్యులర్ గా సోషల్ మీడియా ద్వారా తమ ప్రేమను తెలియజేస్తూ ఉంటారు. ఇద్దరి ప్రొఫెషన్ కారణంగా వేరు వేరు దేశాల్లో ఉంటున్నా కూడా ఎప్పటికప్పుడు ఇద్దరు మాట్లాడుకోవడం.. పోట్లాడుకోవడం అన్ని జరుగుతూ ఉంటాయట. తాజాగా మరోసారి భర్త నిక్ పై తనకు ఉన్న అభిమానం మరియు ప్రేమను ప్రియాంక షేర్ చేసింది.

భర్త తలపై ముద్దు పెట్టగా ఆమె లిప్ స్టిక్ అతడి పై ముద్ర పడింది. ఆ ఫొటోను షేర్ చేసిన ప్రియాంక చోప్రా.. అతడి తలపై నా లిప్ స్టిక్ గుర్తు… చాలా మిస్ అవుతున్నాను అంటూ భారంగా ఒక కామెంట్ పెట్టింది. నిక్ తో కొన్ని వారాలుగా దూరంగా ఉంటున్న ప్రియాంక చోప్రా ఇలా తన భర్త తాలూకు జ్ఞపకాలను నెమరవేసుకుంటూ ఉంది.