భర్తను చంపేందుకు భారీ స్కెచ్.. బట్టబయలు చేసిన కూతురు

0

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తనే మట్టుబెట్టేందుకు స్కెచ్ వేసింది ఓ ఇల్లాలు.. కానీ కూతురు ఎంట్రీతో సీన్ రివర్స్ అయ్యింది. పరాయిమొగాళ్ల మీద మోజుతో కొందరు యువతులు.. పండంటి సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల తెలుగురాష్ట్రాల్లో ఇటువంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన చెల్లుబోయిన కుమారికి చాలా క్రితం సుధాకర్తో పెళ్లయింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలకు ఇప్పటికే పెళ్లిల్లు కూడా చేశారు. ప్రేమగుడ్డిది ప్రేమకు వయస్సుతో సంబంధం లేదూ అనుకున్నదో ఏమోకానీ.. ఈ వయసులో కుమారి.. పరాయి మగవాడి మోజులో పడింది. కట్టుకున్న మొగుడ్ని వదిలిసి ఇదే ప్రాంతానికి చెందిన సతీశ్ అనే వ్యక్తితో తిరుగుతోంది. వీరి చీకటి భాగోతాన్ని భర్త సుధాకర్ పసిగట్టాడు. రెడ్హ్యాండెడ్గా ఈ జంటను దొరికించుకొని ఇద్దరినీ చితకబాదాడు. దీంతో కుమారి భర్తపై కోపం పెంచుకుంది. ఎలాగైనా మొగుడి పీడ వదిలించుకోవాలని స్కెచ్ వేసింది. కాగా కుమారి చిన్న కూతురుకు తల్లి వ్యవహారంపై అనుమానం వచ్చింది. దీంతో ఆమె ఫోన్లో కాల్స్ ఆటోమెటిగ్గా రికార్డు అయ్యాలా ఫోన్లో సెట్టింగ్ మార్చింది.

ఆ ఆడియో క్లిప్స్ నేరుగా తన మెయిల్కు వచ్చేలా సెట్చేసుకుంది. అనంతరం తల్లి మాట్లాడిన ఆడియోక్లిప్స్ విని కూతురు షాక్ అయ్యింది. భర్తను ఎలా చంపాలో తన ప్రియుడితో కలిసి తల్లి స్కెచ్ వేసింది. అతడికి స్లో పాయిజన్ ఇచ్చి మట్టుబెట్టాలని తన తల్లి.. ఆమె ప్రియుడు స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా ఓసారి అన్నంలో తక్కువ మోతాదు విషం కలిపి ఇచ్చింది. భర్త కోలుకున్నాడు. కానీ చిన్నకూతురు తన తండ్రికి సమాచారం ఇవ్వడంతో .. అతడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో వీళ్ల వ్యవహారం బెడిసికొట్టింది. ఈ కేసులో సతీశ్ కుమారితోపాటు హత్యాయత్నానికి సహకరించిన సతీశ్ స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.