ఏపీ విద్యాశాఖ మంత్రికి కరోనా

0

కరోనా ఏపీలో కోరలు చాస్తోంది. అందరికీ సోకుతోంది. రోజుకు 10వేల చొప్పున కేసులు నమోదవుతూ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. దీంతో సామాన్యులు అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు.. ఇలా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు.

తాజాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన ఎర్రగొండెపాలెం పీహెచ్.సీలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

తాజాగా వెలువడ్డ ఆ పరీక్షల్లో మంత్రికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వైద్య అధికారులు తెలిపారు. దీంతో తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సురేష్ కోరారు.

ఇప్పటికే ప్రకాశం జిల్లాలో చాలా మంది ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి సురేష్ కూడా ఆ మహమ్మారి బారిన పడడం గమనార్హం.