గులాబీ సోయగాలతో తళుక్కుమన్న మెగాస్టార్ అమ్మడు..!!

0

కాజల్ అగర్వాల్. మూడు పదుల వయసులో కూడా వన్నె తరగని నటి. కెరీర్ మొదలై ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికి కుర్రకారును కలలరాణిగా ఏలుతుంది. అలాంటి అందం అభినయం ఉన్న ఈ అందాల భామ.. సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకుంది. కాజల్ కెరీర్ ముగిసిందని అనుకున్న ప్రతిసారి తనని తాను నిరూపించుకుంటూనే ఉంది. ఈ ముంబై సుందరి సౌత్ ఇండస్ట్రీలతో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను దక్కించుకుంటూ మెప్పిస్తుంది. ప్రస్తుతం కాజల్.. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయినుగా మారింది. లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో మొదలైన కాజల్ సినీప్రయాణం ఆ తర్వాత చందమామ సినిమాతో ఊపందుకుంది. అమ్మడి అందాల ఆరబోతకు వెనక్కి తిరిగి చూసే అవకాశం రాలేదు. ప్రతీ సినిమాలో తన అందాలతో అభిమానులను ఊరిస్తూనే ఉంది. ఇప్పటివరకు యాభై సినిమాల వరకు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా నటించిన ఈ భామ..

కెరీర్ మొదలైన అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోయినుగా ఎదిగిపోయింది. మొదటి నుండి కూడా కాజల్ బిజీ హీరోయినే.. ఎల్లప్పుడూ చేతి నిండా సినిమాలతో గడుపుతుంది. కెరీర్లో ఎన్నో సూపర్ హిట్లతో పాటు ప్లాప్ అనుభవాలను కూడా చవిచూసింది. అన్నీ కలిపి అమ్మడు రోజురోజుకి తనని తను గొప్ప నటిగా మలుచుకుంటుంది. ప్రస్తుతం కమల్ హాసన్ సరసన ‘ఇండియన్-2’.. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోంది. అమ్మడు తెలుగు తమిళం అనే తేడా లేకుండా రెచ్చిపోతుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన కాజల్.. తాజాగా ఓ ఫోటోషూట్లో తళుక్కుమని మెరిసింది. ఆ ఫోటోలో పద్ధతిగా ఎలాంటి స్కిన్ షో లేకుండా సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. గులాబీ రంగు దుస్తులలో.. అందమైన చిరునవ్వుతో చూపరుల మనసులు గిల్లుతోంది. అసలు కాజల్ మేని ఛాయతో ఆ ఫోటోకి మరింత రొమాంటిసిజమ్ యాడ్ అయినట్లు అనిపిస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అమ్మడి పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.