క్యాన్సర్ భయం.. 2025నాటికి డేంజరే

0

సమాజం ఎంత ఆధునికత వైపు అడుగులు వేస్తుంటే అన్ని కొత్త రోగాలు మనుషులను చుట్టుముడుతున్నాయి. టెక్నాలజీ శాస్త్ర సాంకేతికత ఇంత పెరిగిందని మనం విర్రవీగుతుంటే కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచానే షేక్ చేస్తోంది. దానికి మందు వ్యాక్సిన్ కనిపెట్టలేక ఆపోసాపాలు పడుతున్నాం.

ఇక కరోనానే కాదు.. దేశంలో క్యాన్సర్ కూడా ప్రమాదకరంగా తయారవుతోందని జాతీయ క్యాన్సర్ నమోదు కార్యక్రమం నివేదిక-2020 వెల్లడించింది. 2025 నాటికి దేశంలో క్యాన్సర్ రోగులు 15.7 లక్షలకు చేరే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ప్రస్తుతం దేశంలో 13.9 లక్షల మంది క్యాన్సర్ రోగులు ఉన్నారని నివేదిక తెలిపింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో పొగాకు వినియోగం అత్యధికంగా ఉండడం వల్ల అక్కడ ఎక్కువమంది క్యాన్సర్ బారిన పడుతున్నారని తేల్చింది.

ప్రధానంగా ఈ వ్యాధి పురుషుల్లో నోరు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా వస్తుండగా.. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వస్తోందని నివేదిక పేర్కొంది.