Templates by BIGtheme NET
Home >> Telugu News >> వివేకా కేసులో త్వరలో పెను సంచలనాలు…?

వివేకా కేసులో త్వరలో పెను సంచలనాలు…?


మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో రానున్న రెండు మూడు రోజులలో పెను సంచలనాలు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దర్యాప్తు సంస్థలు తమ పని చేసుకోనివ్వాలన్న అత్యున్నత న్యాయం స్థానం తీర్పు మేరకు సీబీఐ దూకుడు ఇంకా పెంచడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే సీబీఐ కొత్త సిట్ టీం పులివెందులలో మకాం వేసి అక్కడ పరిస్థితిని పిన్ టూ పిన్ క్షుణ్ణంగా పరిశీలించింది.

తమ దగ్గర ఉన్న రికార్డులతో లేటెస్ట్ పరిశీలనని సరిపోల్చుకుంది. ఒక వైపు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ వరసగా మూడు రోజుల పాటు విచారణ చేసింది. అలాగే కస్టడీలో ఉన్న వైఎస్ భాస్కరరెడ్డి ఉదయ కుమార్ రెడ్డిలను కూడా వరసగా విచారించింది. ఇంతలోనే వివేకా అల్లుడుగా ఉన్న నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని రెండు రోజుల పాటు విచారించింది.

ఇదిలా ఉంటే ముందస్తు బెయిల్ రద్దు కావడంతో అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు. ఇపుడు సీబీఐ చూపు ఫ్లాష్ బ్యాక్ వైపు ఉంది అంటున్నారు. 2019 మార్చి 15న వివేకా హత్యకు గురి అయ్యారు. ఆ టైం లో కడప ఎస్పీగా రాహుల్ దేవ్ శర్మని సీబీఐ తాజాగా పిలిచి విచారించడం ఈ కేసులో కొత్త మలుపు అని అంటున్నారు.

వివేకా హత్య తరువాత పూర్తిగా అధ్యయనం చేసిన రాహుల్ దేవ్ శర్మ హత్యా స్థలంలో వేలి ముద్రల గురించి కూడా మీడియాకు చెప్పారు. వివేకా శరీరం పైన ఏడు గాయాలు ఉన్నాయని నాడు ఆయన వెల్లడించారు. వివేకా నివాసానికి ఆయన వెళ్ళి పూర్తి స్థాయిలో నాడు విచారణ జరిపారు. ఇపుడు ఇంతటి ముఖ్యమైన దశలో సీబీఐ కడపలో అప్పట్లో పనిచేసిన రాహుల్ దేవ్ శర్మను పిలిచి ఆయన నుంచి కీలక సమాచారం తీసుకుందని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఈ కేసులో సీబీఐ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. అదే టైం లో వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ని సుప్రీం తోసి పుచ్చింది. పైగా హై కోర్టు ఇచ్చిన ఆదేశాలు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయని పేర్కొన్న నేపధ్యంలో ఈ నెల 25న తెలంగాణా హై కోర్టు ముందస్తు బెయిల్ మీద ఏ విధంగా తీర్పు ఇస్తుంది అన్న చర్చ ఉంది.

ఒకవేళ ముందస్తు బెయిల్ మీద సుప్రీం కోర్టు పేర్కొన్నట్లుగానే తోసిపుచ్చితే మాత్రం అవినాష్ రెడ్డికి దారులు అన్నీ పూర్తిగా మూసిపోతాయని అంటున్నారు. ఆ తీర్పును చూసిన మీదట సీబీఐ తన కీలక నిర్ణయాలను అమలు చేస్తుందని అంటున్నారు. మరో వైపు చూస్తే బెయిల్ కనుక మంజూరు అయితే ఈ కేసులో జాప్యం ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద ఈ కేసులో ఈ నెల 25వ తేదీ చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు.