చిరుత చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన నేహాశర్మ ఆ తర్వాత సౌత్ లో అవకాశాలొచ్చినా నటించలేదు. ఈ భామ పూర్తిగా బాలీవుడ్ కే అంకితమైంది. అయితే అక్కడ కూడా కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో స్టార్ డమ్ అందుకోలేదు. శర్మా సిస్టర్స్ (నేహాశర్మ- ఐషా శర్మ) స్పెషల్ షోలు.. యూట్యూబ్ చానెల్ కథనాలు ఇప్పటికే అంతర్జాలంలో బోలెడంత పాపులరయ్యాయి. సోషల్ మీడియా ఫోటోషూట్లతోను ఈ భామలు బోలెడంత క్రేజ్ దక్కించుకున్నారు.
ఇటీవలి కాలంలో చిరుత బ్యూటీ నేహాశర్మ టూమచ్ గా ఎక్స్ పోజ్ చేస్తూ మీడియా ముందు ఫోజులు కొడుతున్న ఫోటోలు వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. నేహా చిల్లింగ్ ఎక్స్ పోజింగ్ వీడియోలు నిరంతరం వేడెక్కిస్తూనే ఉన్నాయి. శర్మా గాళ్ కి సోషల్ మీడియాలో లక్షలాదిగా ఫాలోవర్లు ఏర్పడ్డారంటే గ్లామర్ ట్రీట్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు. నేహా ఇటీవల ఒక పబ్లిక్ ఈవెంట్ లో అందాలు ఆరబోసిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. అందమైన పసుపు రంగు లెహంగా- డిజైనర్ బ్లౌజ్లో నేహా జిగిబిగి అందాలు కనువిందు చేసిన తీరుకు ఔరా! అంటూ ముక్కున వేలేసుకున్నారు. అంతగా ఏమాత్రం భేషజం లేకుండా అందాలను ఆరబోసింది ఈ బ్యూటీ.
నేహా జిగిబిగి అందాలు.. నడుమందం.. నాభి సొగసు ఇలా ప్రతిదీ కుర్రకారుకు స్పెషల్ ట్రీట్ గా మారాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారగా నెటిజనుల్లో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు అభిమానులు గ్లామర్ విందును ఇష్టపడుతున్నా.. కొందరు ఈ ఫ్యాషన్ సెన్స్ ను నిలదీస్తున్నారు. బికినీలు .. స్విమ్ సూట్ లతో చెలరేగే ఈ బ్యూటీ ఈ ఏడాది సమ్మర్ వెకేషన్ కోసం సుదూర తీరంలోని ఒంటరి దీవులకు వెళ్లనుందని తెలిసింది. నేహా శర్మ తదుపరి కుషన్ నంది తెరకెక్కిస్తున్న రొమాంటిక్ కామెడీ `జోగిర సర రా రా`లో నవాజుద్దీన్ సిద్ధిఖీ- సంజయ్ మిశ్రాతో స్క్రీన్ స్పేస్ ను షేర్ చేసుకుంది.
Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.