Templates by BIGtheme NET
Home >> Telugu News >> బ్రేకింగ్: కరోనా వ్యాక్సిన్ ధరపై కేంద్రం సంచలన ప్రకటన

బ్రేకింగ్: కరోనా వ్యాక్సిన్ ధరపై కేంద్రం సంచలన ప్రకటన


కరోనా వ్యాక్సిన్ పై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులు ప్రభుత్వమే కొని వైద్యులు సిబ్బందికి వేయగా.. ఇక మార్చి 1 నుంచి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.టీకా కొనుగోలు సామర్థ్యం ఉన్న వారికి ప్రైవేటు ఆస్పత్రుల్లో వేసుకునే వెసులుబాటు కల్పించాలని కొన్ని వర్గాల నుంచి కేంద్రానికి వినతులు వచ్చాయి. దీంతోపాటు వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా ఆలస్యం కాకుండా ఉండేందుకే కేంద్రం ప్రైవేటులో వ్యాక్సిన్ ధరను నిర్ణయించి దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రైవేటు ఆస్పత్రులు పాటించి ఈ టీకాను వేయాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా వ్యాక్సిన్ ధరను కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. టీకా ధర రూ.150గా.. సర్వీస్ ఛార్జ్ ను రూ.100గా కేంద్రం ఫిక్స్ చేసింది.మొత్తంగా టీకా ధర రూ.250 దాటకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేసే టీకా ఖర్చును కేంద్రమే భరించనుండగా.. ప్రైవేట్ గా మాత్రం ఒక్కో డోసుకు ప్రజలే రూ.250 భరించాలని పేర్కొంది.

మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా రెండోవిడత కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. 60 ఏళ్ల పైబడినవారు 45-60 ఏళ్ల మధ్యన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ను కేంద్రం ఉచితంగా వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.