సుశాంత్: తన కొడుకు ప్రమేయంపై స్పందించిన మహారాష్ట్ర సీఎం

0

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసులో తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే స్పందించారు. ఈ కేసులో తన కుమారుడు ఆదిత్య సహా మహారాష్ట్ర పుత్రులు ఎవరికి సంబంధం లేదని ఉద్దవ్ ఠాక్రే స్పష్టం చేశారు.

శివసేన దసరా ర్యాలీలో పాల్గొన్న ఉద్దవ్ మాట్లాడారు. తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కంగనా రౌనత్ కు కౌంటర్ ఇచ్చారు. బీహార్ పుత్రుడి ఆత్మహత్యకు తన పుత్రుడు సమా మహారాష్ట్ర పుత్రులు ఎవరికి సంబంధం లేదని.. అది ఆత్మహత్య అని అంటున్నారని మహారాష్ట్ర సీఎం స్పష్టం చేశారు. న్యాయం కోసం ఏడుస్తున్న వారు ముంబై పోలీసులను పనికిరాని వారిగా చిత్రీకరిస్తున్నారని కంగనకు చురకలంటించారు.

గంజాయిని మీ రాష్ట్రంలోనే పండిస్తారని.. మహారాష్ట్రలో కాదంటూ హిమాచల్ ప్రదేశ్ కు చెందిన కంగనను ఉద్దేశించి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముంబై పోలీసులను చూసి గర్విస్తున్నామని.. వారు 26/11 దాడుల్లో ఉగ్రవాదులను సజీవంగా పట్టుకున్నారని ప్రశంసించారు.

ముంబైని పీవోకేతో పోల్చడం ప్రధాని మోడీకే అవమానమని.. పీవోనికి స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఇప్పటికీ ఆరేళ్లయినా మోడీ చేయలేదని ఉద్దవ్ విమర్శించారు. సుశాంత్ మరణం వెనుక ఎవరి ప్రమేయం లేదని.. ఈ వివాదంపై తొలిసారి ఉద్దవ్ స్పష్టం చేశారు.