Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఏపీ స్కూళ్లల్లో కరోనా విజృంభణ వేద పాఠశాలలో మరో 10 మందికి కరోనా !

ఏపీ స్కూళ్లల్లో కరోనా విజృంభణ వేద పాఠశాలలో మరో 10 మందికి కరోనా !


తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పాఠశాలలో మళ్లీ కరోనా కలకలం సృష్టించింది. టీటీడీ వైద్య సిబ్బంది తాజాగా తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పాఠశాలలో కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా మొత్తం 10 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఆ పది మందిలో ఆరుగురు విద్యార్థులు నలుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా పాజిటివ్ గా నిర్దారించిన పదిమందిని మెరుగైన చికిత్స కోసం పద్మావతి కరోనా హాస్పిటల్ కి తరలించారు.

ఐదురోజుల క్రితం వేద పాఠశాలలో కరోనా కేసులు వెలుగు చూడటంతో విద్యార్థులకు బోధనా సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యులు మొత్తం 75 మందికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇవాళ కరోనా పరీక్షలు చేయించింది. 10 మందికి పాటివ్ రావడంతో వీరిని తిరుపతి స్విమ్స్కు తరలించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గత వారం వేద పాఠశాలలో 57 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో చాలా మంది విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం వేద పాఠశాలలో 21 మంది విద్యార్థులుండగా వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్గా తేలింది.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా నియమాలు పాటిస్తూ స్కూల్స్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పొన్నూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ లో 8 మంది విద్యార్ధులకి కరోనా పాజిటివ్ గా తేలింది. దీనితో ఆ స్కూల్ ను మూసేశారు. దీనితో స్కూల్ కి వెళ్లేవారు జాగ్రత్తలు పాటించండి.