Templates by BIGtheme NET
Home >> Telugu News >> కరోనా వ్యాక్సిన్ కు చాలా సమయం పడుతుంది!?

కరోనా వ్యాక్సిన్ కు చాలా సమయం పడుతుంది!?


కరోనా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. అందరూ ఈ వ్యాక్సిన్ వచ్చే ఏడాది జనవరి వరకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే వచ్చే సమ్మర్ వరకైనా దరికి చేరుతుందని భావిస్తున్నారు. కానీ కోవిడ్ వ్యాక్సిన్ కోసం సామాన్య ప్రజలు 2022 వరకు వేచి ఉండాల్సిందేనని ఎయిమ్స్ డైరెక్టర్.. భారతదేశంలో కరోనావైరస్ నిర్వహణపై జాతీయ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రణదీప్ గులేరియా స్పష్టం చేశారు. కొరోనావైరస్ వ్యాక్సిన్ భారతీయ మార్కెట్లలో సులభంగా లభించడానికి “సంవత్సరానికి పైగా” సమయం పడుతుందని ఆయన అన్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణదీప్ గులేరియా మాట్లాడారు.. “మన దేశంలో 130 కోట్ల జనాభా.. ఫ్లూ వ్యాక్సిన్ లాగా టీకాను మార్కెట్ నుంచి కొనుగోలు చేయడానికి చాలా సమయం పడుతుంది. వాస్తవానికి ఇది మరింత ఆలస్యం కావచ్చు’ అని ఆయన అన్నారు.

కరోనావైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భారతదేశం ఎదుర్కోవాల్సిన సవాళ్ళ గురించి ఆయన వివరించారు. ప్రధానంగా వ్యాక్సిన్ పంపిణీ.. దేశంలోని ప్రతి ప్రాంతానికి చేరేలా చూసుకోవడం ముఖ్యం అన్నారు. “వ్యాక్సిన్ భద్రపరచడం తగినంత సిరంజిలు తగినంత సూదులు కలిగి ఉండటం మరియు దేశంలోని మారుమూల ప్రాంతానికి ఆటంకం లేకుండా అందించడం అతిపెద్ద సవాలు” అని ఆయన అన్నారు. మరొక టీకా శక్తివంతమైనది వస్తే దాన్ని ప్రజలకు పంచాల్సి ఉంటుంది. ఇది మొదటిదాని కంటే ఎక్కువ ప్రభావవంతంగా కనిపిస్తే మళ్లీ ప్రాసెస్ మొదటికొస్తుందని తెలిపారు.

“ మనకు తరువాత వచ్చిన టీకా మొదటిదాని కంటే ఎక్కువ ప్రభావవంతంగా కనిపిస్తే దాన్ని ఎలా ఉంచాలి? కోర్సు ఎలా చేయాలి? టీకా ఎవరికి కావాలి.. ఎవరికి అవసరం అని ఎలా నిర్ణయించుకోవాలి? చాలా నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉంది ”అని ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పారు. టీకాలతో కరోనావైరస్ సంక్రమణ “అంతరించిపోదు” అని నొక్కి చెప్పాడు. కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచంలోని దేశాలకు పంచడంలో టీకా ఉత్పత్తి – డెలివరీలో తమ సామర్థ్యాలను ఉపయోగిస్తామని భారతదేశం అనేక దేశాలకు ఇప్పటికే హామీ ఇచ్చింది. ఈ క్రమంలో వ్యాక్సిన్ పంపిణీ ఉత్పత్తిలో భారత్ ది గొప్ప పాత్ర అవుతుందని ఆయన తెలిపారు.