Templates by BIGtheme NET
Home >> Telugu News >> డూమ్స్ డే క్లాక్ : ప్రపంచం అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉందా .. హెచ్చరిక !

డూమ్స్ డే క్లాక్ : ప్రపంచం అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉందా .. హెచ్చరిక !


డూమ్స్ డే క్లాక్ మరో హెచ్చరిక జారీ చేసింది. అర్ధరాత్రికి కేవలం మరో 100 సెకన్ల దూరంలో నిలిచింది. ప్రపంచం అంతమయ్యే రోజు మరెంతో దూరంలో లేదని ఈ గడియారాన్ని చూసిన నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి అణు యుద్ధం పర్యావరణంలో మార్పులతో డూమ్స్ డే క్లాక్ అర్ధరాత్రికి మరింత చేరువైంది. గతంలో ఇంత దగ్గరగా ఎప్పుడూ రాలేదని అటామిక్ సైంటిస్ట్స్ బులెటిన్ అధ్యక్షుడు రేచెల్ బ్రాన్సన్ చెప్పారు. సైన్స్ పై విశ్వాసం లేకపోవడం కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని బ్రాన్సన్ అన్నారు. మానవాళికి కరోనా అనేది ఓ మేలుకొలుపులాంటిది.

దేశాలు అంతర్జాతీయ సంస్థలు దీనిని ఎదుర్కోవడానికి సిద్ధం కాలేదు అని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది మిడ్ నైట్ కు 2 నిమిషాల దూరంలో ఉన్న ఈ క్లాక్.. ఇప్పుడు 100 సెకన్లకు చేరింది. ఇదిలా ఉంటే అసలు డూమ్స్ డే క్లాక్ ఏమిటి..ఇది అర్ధరాత్రికి చేరువ కావడం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం. అసలు ఈ గడియారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ క్లాక్ ను 1947లో ఆల్బర్ట్ ఐన్ స్టీన్ షికాగో యూనివర్సిటీ విద్యార్థులు కలిసి స్థాపించిన బులెటిన్ ఆఫ్ ద అటామిక్ సైంటిస్ట్స్ అభివృద్ధి చేసింది. ఈ బోర్డులో 13 మంది నోబెల్ గ్రహీతలు ఉన్నారు. ప్రపంచం అంతమవడానికి ఎంత దగ్గరలో ఉందో చెప్పేందుకు ఈ గడియారాన్ని నిదర్శనంగా చెబుతారు. మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లకు అనుగుణంగా ఈ గడియారాన్ని సవరిస్తూ ఉంటారు.

మొదట్లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ గడియారాన్ని అర్ధరాత్రికి 7 నిమిషాల దూరంలో సెట్ చేశారు. ఆ తర్వాత 1991లో కోల్డ్ వార్ ముగిసిన తర్వాత దీనిని 17 నిమిషాలకు సెట్ చేశారు. అణ్వాయుధాలతోనే ఈ ప్రపంచం అంతమవుతుందన్నది చాలా రోజులుగా ఉన్న ఆందోళన. అందుకే ఈ అటామిక్ సైంటిస్ట్స్లోని సభ్యులు అణ్వాయుధాలను లేకుండా చేయాలని పిలుపునిస్తున్నారు. రష్యాతో కొత్త అణు ఒప్పందాన్ని ప్రారంభించడంతోపాటు ఇరాన్తో మళ్లీ అణు ఒప్పందంలోకి అమెరికా రావాలని వీళ్లు సూచిస్తున్నారు. అంతేకాదు కర్బన ఉద్గారాలను నిర్మూలించడానికి అమెరికా చైనా ఇతర పెద్ద దేశాలు కలిసి రావాలని బులెటిన్ ఆఫ్ అటామిక్ సైంటిస్ట్స్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు జెర్సీ బ్రౌన్ సూచించారు.

మానవాళి వినాశనానికి ఎంత దూరంలో ఉందన్న దాన్ని బట్టి సమయాన్ని ముందుకు వెనక్కు మారుస్తూ ఉంటారు. 1991లో అమెరికా సోవియట్ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. ఇది ముగిశాక గడియారంలో సమయాన్ని రాత్రి 11.43కు మార్చిన సంగతి తెలిసిందే. అణ్వాయుధాలు వాతావరణ మార్పులకు సంబంధించి ఆందోళనలు రేగుతున్నాయి. ప్రపంచ దేశాల అధినేతలు దీని పై సరైన విధంగా స్పందించడం లేదనే విమర్శలున్నాయి. తర్వాత ఈ కాలాన్ని 11.58కి మార్చారు. ఉత్తర కొరియాపై అణు దాడికి సిద్ధంగా ఉన్నామంటూ గతంలో ట్రంప్ పరోక్షంగా ప్రకటించడం పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాలని అమెరికా నిర్ణయం తీసుకోవడం తదితరాలను ఇందుకు కారణాలుగా భావించవచ్చు. ప్రపంచం వినాశనానికి అత్యంత దగ్గరగా ఉన్నట్లు తొలిసారిగా 1953లో ఈ గడియారం చూపించింది. ఆ ఏడు అమెరికా సోవియట్ యూనియన్ లు హైడ్రోజన్ బాంబులు పరీక్షించడంతో సమయాన్ని 11.58కి మార్చారు. డూమ్స్ డే క్లాక్ ఇప్పుడు మరో హెచ్చరిక జారీ చేసింది. అర్ధరాత్రికి కేవలం కొద్ది సెకన్ల దూరంలో నిలిచింది. ప్రపంచం అంతమయ్యే రోజు మరెంతో దూరంలో లేదని ఈ గడియారాన్ని చూసిన నిపుణులు చెబుతున్న మాట.