Templates by BIGtheme NET
Home >> Telugu News >> కరోనా ఎఫెక్ట్ అన్నింటి పై పడినా .. ఆ ఒక్క రంగం వృద్ధి చెందింది!

కరోనా ఎఫెక్ట్ అన్నింటి పై పడినా .. ఆ ఒక్క రంగం వృద్ధి చెందింది!


కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకి గత ఏడాది ఎగుమతులు దిగుమతులపై భారీ ప్రభావం పడింది. ఈ క్లిష్ట సమయంలో వ్యవసాయంపై ప్రభావం పడలేదు. పైగా వృద్ధికి వ్యవసాయ వృద్ధి దోహదపడింది. ఏప్రిల్-డిసెంబర్ కాలంలో కామర్స్ మినిస్ట్రీ ఎగుమతుల జాబితా ప్రకారం అగ్రి ఎగుమతులు పెరిగాయి. 2020 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో మొత్తం ఎగుమతులు 201.30 బిలియన్ డాలర్లుగా నమోదయింది. 2019లో ఇదే కాలంలో 238.27 బిలియన్ డాలర్లుగా ఉంది. కరోనా సమయంలో భారత మర్చంటైజ్ ఎగుమతులు 15.5% క్షీణించాయి. అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తులు మాత్రం 9.8% పెరిగాయి.

అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 2019లోని 26.34 బిలియన్ డాలర్ల నుండి 28.91 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. దిగుమతులు 5.5 శాతం తగ్గడంతో అగ్రికల్చర్ ట్రేడ్ సర్ ప్లస్ 2019 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 9.57 బిలియన్ డాలర్లు కాగా 2020 అదే కాలంలో 13.07 బిలియన్ డాలర్లకు పెరిగింది. వ్యవసాయ ఎగుమతుల పెరుగుదల ఎక్కువగా ప్రపంచ ధరలకు అనుగుణంగా ఉంటుంది. ఐక్య రాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ గురువారం తాజా ఆహార ధరల సూచీ ని జనవరి నెలకు గాను విడుదల చేసింది. 2014-2016 సంవత్సరాల కాలాన్ని ఆధారంగా చేసుకొని 100 పాయింట్లకు ఇచ్చారు.

దీని ప్రకారం మే 2020 – జనవరి 2021 మధ్య 113.3 పాయింట్లుగా ఉంది. ఇప్పటి వరకు 2014 జూలైలో 116.4 పాయింట్లు అధికం. ఆ తర్వాత ఇదే గరిష్టం. FPI 48 నెలల కనిష్ట స్థాయి నుండి 78 నెలల గరిష్టానికి పెరిగింది. గత కొన్నేళ్ళుగా దేశీయ వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయి. 2003-04 నుండి 2013-14 కాలంలో ఎగుమతులు 7.53 బిలియన్ డాలర్ల నుండి 43.25 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2015-16 కాలంలో ఎగుమతులు 32.81 బిలియన్ డాలర్లు కాగా 2018-19 నాటికి 39.20