Templates by BIGtheme NET
Home >> Telugu News >> తండ్రి కొడుకుల సైబర్ ఆట.. బిట్ కాయిన్ పేరుతో సంచలన మోసం

తండ్రి కొడుకుల సైబర్ ఆట.. బిట్ కాయిన్ పేరుతో సంచలన మోసం


గుజరాత్ కు చెందిన తండ్రీకొడులు ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజల నుంచి కోట్ల రూపాయల డబ్బు ను దోచేస్తున్నారు. సరిగ్గా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కు 65 కి మీ దూరంలో ఉన్న అఖాజ్ గ్రామానికి చెందిన వారు ప్రజల డబ్బును ఈజీగా కొల్లగొడుతున్నారు. వీరు ఉండే గ్రామం గతంలో బాగా చదువుకుని అమెరికా వెళ్లిన వారికి ప్రసిద్ధి గా ఉండేది. ఎక్కువ మంది ఉద్యోగం తోనో వ్యాపారం తోనో బాగా విదేశాల్లో సెటిల్ అయ్యారు. అందుకే ఈ గ్రామం కు చాలా మంచి పేరు ఉంది. వీరు అదే గ్రామానికి చెందిన దానికి గుడ్ విల్ ను తీసేస్తున్నారు. ఇంతకీ ఈ తండ్రీకొడుకులు ఎవరు..? వారు ఏం చేశారు.? ఎలా చేశారు? అనేది తెలుసుకుందాం…

అఖాజీ గ్రామానికి చెందిన 41 ఏళ్ల నీల్ అనే వ్యక్తి కుమారుడు. ఈయనకు ఇంకో పేరు కూడా ఉంది. అదే హితేష్ పటేల్. ఈ నీల్ తండ్రి పేరు గోర్ధన్ భాయి పటేల్. వీరు మన దేశంలో ఉండే చాలా మంది అకౌంట్ల నుంచి డబ్బులు లూటీ చేస్తున్నారు. పెరుగుతున్న సాంకేతికత అడ్డు పెట్టుకుని పలు కంపెనీలు వివిధ మొబైల్ అప్లికేషన్ తయారు చేసినట్లు చెప్పి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈ తండ్రి కొడుకుల చేతిలో మోసపోయిన వారు దేశ వ్యాప్తంగా ఉన్నా కానీ ఎక్కువ మంది మాత్రం సొంత రాష్ట్రం అయిన గుజరాత్ కు చెందిన వారే.

వీరి పై ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా అభియోగాలు ఉన్నాయి. కనీసం వీరి కోసం సుమారు 6 రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్నారు అంటే వారు చేసిన సైబర్ నేరాలు ఎలాంటివో… వాటి మొత్తం ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే గత నెలలో తండ్రి అయిన గోర్ధన్భాయిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వెల్లడించిన దాని ప్రకారం ఈ తండ్రి కొడుకులపై దేశ వ్యాప్తంగా సుమారు 90 కి పైగా కేసులు ఉన్నాయి. ఒక్క తెలంగాణాలోనే వీరిపై 5 కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. వీరు రాజస్థాన్ తో పాటు కర్ణాటక పోలీసులు కూడా బాగా కావాల్సిన వారు అంటే వీరి చిట్టా ఎంత ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు.

ఈ తండ్రీ కొడుకు ప్రజలకు డబ్బు ఆశ చూపించి బురిడీ కొట్టించి నట్లు దర్యాప్తులో తేలింది. వీరు ఓ కంపెనీని ముందుగా రిజిస్ట్రేషన్ చేయించారు. దీనికి బేస్ చేసుకుని వెబ్ సైట్లు మొబైల్ అప్లికేషన్ లు తయారు చేయడం లాంటివి చేశారు. వీరు కొన్ని లింకులు సృష్టిస్తారు. ఇలా ఇచ్చిన వాటిని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగుల సాయంతో షేర్ చేయించారు. దీంతో వారికి ఉన్న అనుచరులు చాలా మంది డబ్బుకు సంబంధించినది కాబట్టి చూశారు. వీరు ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా టార్గెట్ చేసిన వారిని ట్రాప్ చేసినట్లు వెల్లడి అయ్యింది.

వీరు ప్రజల నుంచి సొమ్ము కాజేసేందుకు నారద్ పే అని అప్లికేషన్ ను వాడారు. దీనిలో పథకం ప్రారంభించారు. మొదటి సారిగా 15 వేలు కడితే ప్రతి నెల వారికి మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు ఇచ్చారు. వారు చెల్లించే సొమ్ము ఇలా ఏడాది పాటు ఇచ్చారు. అయితే ఈ సొమ్ముకు అంత డబ్బు రాదు అని తెలిసినా కానీ… ఆశతో తీసుకున్నారు.

అంతేగాకుండా స్కీం ఏదో బాగుంది అని తెలిసిన వారిని కూడా చేర్పించారు. దీంతో నారద్ పే కి పేమెంట్లు భారీగా రావడం ప్రారంభం అయ్యాయి. అయితే ఇది అంతా కేవలం మూడు నాళ్ళ ముచ్చట గా జరిగి పోయింది. మూడు నెలలు ఇచ్చి తర్వాత చేతులు తీసేశారు. వీటికి తోడు ఈ స్కీంలో చేరిని కొంత మందికి ఫోన్లు కూడా ఇచ్చాడు. అది పేరుకు ఆఫర్ అయినా కానీ వాస్తవానికి అది వారు వేసిన ఎర. ఇది అంతా బాగానే ఉన్నా… తర్వాత ఘట్టానికి కూడా చాలా మందిని తీసుకుని వెళ్లాడు నీల్.

ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్న క్రిప్టో కరెన్సీ ని వారికి పరిచయం చేస్తున్నట్లు చెప్పి… వారి నుంచి 43 వేలకు పైగా వసూలు చేశారు. వారి నుంచి 5 ఇథేరియంతో పాటు 20 బిట్కాయిన్లను కొనుగోలు చేయించే వారు. వీటినే సాకుగా చేసుకుని అక్రమాలకు తెర తీశారు. ది బుల్ రన్ అనే పేరుతో ఓ వెబ్ సైట్ నడిపించారు. దాని నుంచి వచ్చిన ఫండ్స్ ను దోచేశారు. దీనిలో సుమారు పెట్టుబడుల పేరిట 76 వేల కోట్ల రూపాయలకు పైగా అందరి నుంచి తీసుకున్నారు.

వారికి అమెరికా చెక్కులు తాకట్టుగా ఇచ్చేవారు. దీంతో ప్రజలు నమ్మకం కుదిరింది. అయితే ఒక్కసారిగా వారి తరఫున వారు పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. దీంతో భారీ డబ్బు సంపాదించన తరువాత బోర్డు తిప్పేశారు. వీరి నుంచి నష్టపోయింది కేవలం మందు పరులే కాకుండా చాలా మంది ఉన్నారు. ఈ స్కాంలో ఉన్న వారు బయట పడితే పూర్తి వివరాలు వస్తాయి అంటున్నారు నిపుణులు.