Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఆఖరి గంటలో..జీహెచ్ఎంసీ అంతుచిక్కని రహస్యం..

ఆఖరి గంటలో..జీహెచ్ఎంసీ అంతుచిక్కని రహస్యం..


గ్రేటర్ ఎన్నికల్లో ఆఖరి గంటలో ఎక్కడా హడావుడి లేకుండా క్యూ లైన్లు కనిపించకుండా పోలింగ్ ఎలా పెరిగిందనేది ఇప్పుడు అందరు అనుకుంటున్నారు. మంగళవారం పోలింగ్తో పట్టణ ఓటర్లు బద్దకిస్తులు అనేది తేలిపోయింది. గ్రామవాసులకు తెలిసిన ఓటు విలువ పట్టణాల్లో ఉండే వారికి తెలియదంటూ ఆటా డుకున్నారు. ఇదంతా ఒకవైపు ఉంటే… సాయంత్రం ఆఖరి గంట మాత్రం దాదాపు సగం రోజు ఓట్లను రాబట్టినట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెప్పుతున్నాయి. దీంతో అసలేం జరిగిందనే ప్రశ్నలు

మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన పోలింగ్ కేవలం 3.96 శాతమే. 11 గంటల వరకు కూడా అదే పరిస్థితి. ఇంకో నాలుగున్నర శాతం వచ్చారు. అంటే 8.90 శాతం పోలింగ్. ఇక మధ్యాహ్నం ఓటర్లు వస్తారని తినే తీరిక ఉండదనే ఎదురుచూపుల్లో సిబ్బంది ఉన్నారు.

అయినా మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఇంకో పదిశాతం పోలైంది. దీంతో సగం రోజులో 18శాతం పోలింగ్ జరిగింది. ఆ తర్వాత కూడా గంటలకు మూడు నాలుగు శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి అసలు ఇవి ఎన్నికలేనా.. అన్నట్టు సాగిన పోలింగ్ ఆఖరి గంట మాత్రం అద్భుతాన్ని సృష్టించింది.

ఈ అద్భుతం అధికార పార్టీ ముసుగులో ఎన్నికల సంఘం సృష్టించిందా.. అంతా తప్పుపడుతున్నట్టే పోలీసుల సమక్షంలోనే జరిగిందా అనేది రాష్ట్రమంతా తొలిచివేస్తున్న ప్రశ్న. సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం 35.80 శాతం. అప్పటికే అధికారుల మీద రాజకీయ పక్షాల మీద ఒత్తిడి ఆరోపణలు పెరుగడంతో ఎలాగోలా తీసుకువచ్చి ఓట్లేయించారు. కొంతమంది దొంగ ఓట్లు వేస్తుంటే గుర్తించి పట్టకున్నారు.

ఎందుకంటే అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలలోపే. ఇక అప్పటి వరకు ప్రతి గంట గంట పోలింగ్ను పది నిమిషాల్లో ప్రకటించిన ఎన్నికల సంఘం సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ శాతాన్ని నిలిపివేసింది. కారణాలను మాత్రం తెలుపలేదు.

పోలింగ్ శాతం పెరుగడంలో ఆఖరి గంట సమయంలో దొంగ ఓట్లు వేయించారని రిగ్గింగ్కు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పోలీసులు ఎన్నికల సంఘం సంయుక్తంగా అధికార పార్టీకి ఓట్లేయించారని మండిపడుతున్నారు. కానీ ఆరోపణలకు బలం చేకూర్చినట్టుగానే అసలు కనీసం ఎక్కడా ఒక్క లైన్ లేకుండా… సమయంలో ఓటర్లు వచ్చినా.. సమయం దాటినా లైన్లలో లేకున్నా ఓటింగ్ శాతం ఎలా పెరిగిందో అంతు చిక్కకుండా మారింది.