యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Rare Pics.

సెలూన్లో అమ్మాయిల ముచ్చట్లు ..చిరాకుతో బార్బర్ .. వైరల్ వీడియో !

0

కొన్ని కొన్ని వీడియోలు చూసి చూడగానే పడి పడి నవ్వుతారు. ఆ వీడియోలో ఉన్న దాన్ని చూస్తే ఎవరైనా నవ్వేస్తారు. ఆ తర్వాత అసలు ఆ వీడియోలో ఉన్నది ఏంటి ఎవరిదీ తప్పు అని ఆలోచిస్తారు. ఈ వీడియో కూడా అలాంటిదే. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అందరిని నవ్వుల్లో ముంచెత్తింది. అదే సమయంలో అలా చెయ్యడం కరెక్టేనా అని ప్రశ్నిస్తోంది కూడా. అసలేం జరిగింది అంటే .. అదోక హెయిర్ సెలూన్. అక్కడ చాలా మంది యువతులు మహిళలు హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకుంటున్నారు. వాళ్లలో ఎడమవైపున ఓ మహిళ హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకుంటుంటే ఆమెకు కుడివైపున మరో యువతి ఒళ్లో కుక్కతో కూర్చొని ఉంది.

ఆ యువతీ ఈ మహిళ ఫ్రెండ్స్. వాళ్లిద్దరూ ముచ్చట్లు స్టార్ చేశారు. అయితే ఆ మహిళకు హెయిర్ డ్రెస్సర్ హెయిర్ వాషింగ్ చేస్తున్నాడు. ఆమెను కదలకుండా కూర్చోమని పలుమార్లు చెప్పాడు. ఆమె తరచూ కదులుతూనే ఉంది. ఫ్రెండుతో మాట్లాడుతూ… తలను అటూ ఇటూ కదిపేస్తోంది. దీనితో ఆ బార్బర్ పని ముందుకు సాగట్లేదు. హెయిర్ వాషింగ్ సరిగా జరగట్లేదు. అతను హ్యాండ్ షవర్తో జుట్టును శుభ్రం చేద్దామని ప్రయత్నిస్తుంటే ఆమె అస్సలు సహకరించకుండా తన మాటల్లో మునిగిపోయింది. చిరాకొచ్చిన బార్బర్ హ్యాండ్ షవర్ తో ఆమె ముఖంపై వాటర్ చల్లేశాడు. దాంతో ఆమె షాకైంది. ఆమెతోపాటూ పక్కనున్న మహిళలు కూడా షాకయ్యారు. ఆమె మాస్క్ తడిసిపోయింది.


ఈ వీడియోను ట్విట్టర్ యూజర్ జామీ నుమన్ షేర్ చేశారు. దీన్ని చూసి నెటిజన్లు నవ్వుతున్నారు. దీన్ని 60 లక్షల మందికి పైగా చూశారు. అయితే కామెంట్లు రకరకాలుగా వస్తున్నాయి. కొంత మంది ఆమెకు అలాగే జరగాలి కస్టమర్లే ఎప్పుడూ కరెక్ట్ అని అనుకోకూడదు అంటుంటే మరికొంత మంది అతను ఇంకాసేపు సహనంతో ఉంటే పని అయిపోయేది అంటున్నారు. ఇలా ఫ్రస్ట్రేషన్ చూపిస్తే మరోసారి ఆ సెలూన్ కి మహిళలు వస్తారా అని అంటున్నారు. కస్టమర్లలో రకరకాల వాళ్లు ఉంటారు వారిని అర్థం చేసుకొని మెలిగితేనే బిజినెస్ ముందుకు సాగుతుందని సహనంతో ఉండటం చాలా అవసరం అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.