Templates by BIGtheme NET
Home >> Cinema News >> హైకోర్టులో హీరో విజయ్​కు షాక్​.. రూ.లక్ష జరిమానా

హైకోర్టులో హీరో విజయ్​కు షాక్​.. రూ.లక్ష జరిమానా


ప్రముఖ కోలీవుడ్​ నటుడు విజయ్​కు చెన్నై హైకోర్టులో పరాభవం ఎదురైంది. విదేశాల నుంచి కారును దిగుమతి చేసుకున్న క్రమంలో సదరు హీరో పన్ను మినహాయింపు కోరుతూ గతంలో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ‘హీరో అయ్యుండి ట్యాక్స్​ కట్టలేరా?’ అంటూ విమర్శించింది. దీనితో పాటు రూ.లక్ష జరిమానా విధించింది.

కథానాయకుడు విజయ్​.. ఇంగ్లాండ్​ నుంచి ఓ లగ్జరీ కారును దిగుమతి చేసుకున్నారు. అయితే ఆ కారుకు పన్ను మినహాయింపు కోరుతూ.. 2012లో పిటిషన్​ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్​ను మద్రాస్​ హైకోర్టు కొట్టివేసింది. రీల్​ హీరోలు పన్ను కట్టడానికి వెనుకాడుతున్నారని విజయ్​ను ఉద్దేశించి న్యాయస్థానం విమర్శించింది. ఈ పిటిషన్​పై విచారణ జరిపిన హైకోర్టు సదరు హీరోపై రూ.లక్ష రూపాయల జరిమానా విధించింది.