Templates by BIGtheme NET
Home >> Telugu News >> అతడుచేసిన నేరానికి 897 ఏళ్ల జైలుశిక్ష

అతడుచేసిన నేరానికి 897 ఏళ్ల జైలుశిక్ష


ఒక దుర్మార్గ నేరస్తుడికి కోర్టు విధించిన శిక్ష హాట్ టాపిక్ గా మారింది. దీనికికారణం అతడికి విధించిన జైలుశిక్షే. పదేళ్లు.. ఇరవై ఏళ్లు కాదు ఏకంగా 897 ఏళ్ల పాటుజైలు శిక్షను అమలు చేయాలని తీర్పును ఇవ్వటం సంచలనంగా మారింది. ఇంతకీ అతగాడు చేసిన పాడు పని ఏమిటి? ఎక్కడ? అన్న వివరాల్లోకి వెళితే..

సంచలన జైలుశిక్షను అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలో విధించారు. ఇంతకీ దోషిగా తేలిన నేరస్తుడు చేసిన పాపం ఏమిటన్నదిచూస్తే.. నోట మాట రాకుండా పోతుంది. 1991 నుంచి 2006 మధ్య కాలంలో తొమ్మిది మంది మహిళలపై వరుస దాడులు చేశాడు. కిడ్నాప్.. బలవంతంగా రేప్ చేయటం లాంటి 46 కేసుల్లో అతడు నిందితుడు. తాజాగా అతడ్ని దోషిగా నిర్దారిస్తూ కోర్టు తీవ్ర శిక్షను విధించింది.

దాదాపు 15 ఏళ్ల పాటు ప్రజల్నివణికించిన ఈ సీరియల్ రేపిస్టుకు చెక్ పెడుతూ.. కఠిన శిక్షను వేసింది న్యాయస్థానం. రాయ్ చార్లెస్ వాలర్ అనే కామాంధుడు తొమ్మిది మందిమహిళలపై దారుణ రీతిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల ఇళ్లలోకి ప్రవేశించిన అతడు.. బలవంతంగా లైంగికదాడికి పాల్పడేవాడు. కిడ్నాప్ చేయటం.. రేప్ చేయటం.. దొంగతనం చేయటం లాంటి నేరాలకు పాల్పడేవాడు.

అతడ్ని పట్టుకోవటంలో పోలీసులకు మహా ఇబ్బందిగా ఉండేది. దీనికి కారణంగా పోలీసుల వద్ద ఉండే నేరస్తుల డేటా బేస్ లో వాలర్ డీఎన్ ఏ లేకపోవటంతోఅతని జాడ దొరికేది కాదు. దీంతో వాలర్ చేతిలో లైంగిక దాడికి గురైన మహిళ ఇంట్లో లభించిన ఆధారాలతో అతని డీఎన్ఏ ప్రొఫైల్ ను సిద్ధం చేశారు. 2018లో చేసిన నేరంలో అతనికి సంబంధించిన కీలక ఆధారం లభించింది. దీంతో.. నేరస్తుడి బంధవులు జాబితాను గుర్తించారు. వారి ఆధారంతో వాలర్ ను పట్టుకున్నారు. బర్కిలీలోని అతను ఉద్యోగం చేసే సంస్థలోనే అతడ్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమతో కలిసి పని చేసే ఉద్యోగి సీరియల్ రేపిస్టు అన్న వాస్తవం అక్కడి వారికి షాకింగ్ గా మారింది. అతడు చేసిన నేరాలకు తీవ్ర శిక్ష విధిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.