భారత్ మరో సర్జికల్ ఎయిర్ స్ట్రైక్స్

0

సర్జికల్ స్ట్రైక్స్.. ఇప్పుడు ఈ పేరు వింటేనే భారతావని ఉద్వేగంతో పొంగిపోతుంది. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి మరీ అక్కడి ఉగ్రమూకలను తుదముట్టించిన భారత సైనికుల సర్జికల్ స్ట్రైక్స్ ను అందరూ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో సర్జికల్ స్ట్కైక్స్ కూడా భారత ఆర్మీ చేపట్టింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో తిష్టవేసిన ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది.

తాజాగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో భారత్ మరోసారి ఎయిర్ స్ట్రైక్ చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఆఱ్మీ వైమానిక దాడులు చేసినట్లు పీటీఐ కథనంలో వెల్లడించింది.

ఆ ప్రాంతంలో గత వారం రోజులుగా ఈ దాడులు జరుగుతున్నట్లు పేర్కొంది. భారత్ ఎయిర్ స్ట్రైక్ లో పలు ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమవగా.. చాలా మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం.

పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాద మూకలు.. కలిసి భారత సైన్యంపై దొంగచాటుగా దాడులు చేస్తూ ప్రాణాల తీస్తూనే ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఈ దమన కాండకు చెక్ చెప్పాలని భారత్ నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై దండెత్తింది. భారత సరిహద్దు దాటి భారత సైనికులు వెళ్లి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశారు. దాదాపు 50మంది ఉగ్రవాదులను హతమార్చి తిరిగివచ్చారు. ఇప్పుడు చలికాలం కావడం.. మంచు బాగా కురుస్తుండడంతో మళ్లీ ఉగ్రవాద కదలికలు పెరిగాయి. పీవోకేలో భారత్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఉగ్రమూకలు శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తేలడంతో భారత్ మరోసారి అక్కడ దాడులు చేసినట్టు తెలిసింది.