క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్న ఇంటర్ విద్యార్థులు .. ఎక్కడంటే ?

0

పెళ్లి అంటే ఏమనుకున్నారో తెలియదు కానీ రెండు కుటుంబాల సమ్మతితో జరగాల్సిన పెళ్లిని చాలా సింపుల్ గా క్లాస్ రూమ్ లోనే కానిచ్చేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులు క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జూనియర్ కళాశాలలో జరిగింది.

ఈ ఘటన కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఓ మైనర్ బాలిక మైనర్ బాలుడు క్లాస్ రూంనే పెళ్లి మండపంగా మార్చేశారు. అమ్మాయి మెడలో అబ్బాయి ఏకంగా మూడు ముళ్లు వేశాడు. ఆమె నుదిటిన బొట్టు పెట్టాడు. ఏదో ఘన కార్యం చేసినట్లు మొబైల్ లో వీడియో కూడా రికార్డ్ చేశారు. ఆ వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వారిద్దరికీ టీసీ ఇచ్చి పంపించేశాడు. అంతటితో ఈ వివాదం ముగియలేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ఆ పిల్లల తల్లిదండ్రులు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకున్నారు. అయితే ఇది నిజమైన పెళ్లికాదని సోషల్ మీడియాలో లైకుల కోసం మాత్రమే చేశామని విద్యార్థులు చెప్పినట్లు తెలుస్తుంది.