Templates by BIGtheme NET
Home >> Telugu News >> బ్లడ్ గ్రూప్ ఆధారంగా వ్యక్తి మనస్థత్వం ఏంటో ఇలా చెప్పయవచ్చు

బ్లడ్ గ్రూప్ ఆధారంగా వ్యక్తి మనస్థత్వం ఏంటో ఇలా చెప్పయవచ్చు


సాదారణంగా ఏదైనా సందర్బంలో వ్యక్తి ప్రవర్తన ఆధారంగా అతడి మనస్థత్వంను చెప్పే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కో తరహా మనస్థత్వం ఉంటుంది. ఫేస్ ఫీలింగ్ ఆధారంగా కొందరి మనస్థత్వాలను అంచనా వేస్తూ ఉంటాం. ఇక కొందరు మాట్లాడుతూ ఉంటే వారి మనస్థత్వంను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. వారు చేసే పనుల ఆధారంగా వారు నవ్వే తీరును బట్టి వారి అలవాట్లను బట్టి వారు చూసే చూపును బట్టి వారి మనస్థత్వంను అంచనా వేయడం మనలో చాలా మందికి తెలుసు. సాదారణంగా జనాలు వేసే అంచనాలు ఎక్కువగా నిజం అవుతూ ఉంటాయి. కాని కనిపించని రక్తం ఆధారంగా కూడా వారి మనస్థత్వంను అంచనా వేయవచ్చు అంటూ పలు దేశాలకు చెందిన మానసిక వేత్తలు మరియు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్లడ్ గ్రూప్ ను ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తి మనస్థత్వంను అంచనా వేసే ప్రయత్నం చేశారు. దీని కోసం కొన్ని వేల మందిని సర్వే చేశారట. వ్యక్తుల బ్లడ్ గ్రూప్ లను సేకరించి వారి అలవాట్లు మరియు మనస్థత్వం తెలివి తేటలను సర్వే చేశారట. దాన్ని బట్టి అర్థం అయ్యింది ఏంటీ అంటే ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న వారు ఎక్కువ శాతం ఒకేలా ప్రవర్తించడం మనస్థత్వం కలిగి ఉండటంను వారు గుర్తించారట.

‘ఎ’ బ్లడ్ గ్రూప్..
వీరు సున్నిత మనస్కులు.. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచన చేస్తూ.. ప్రతి విషయంలో కూడా శ్రద్దను కనబర్చుతూ ఇతరులకు సాయం చేస్తూ నిర్ణయాలను తీసుకునే విషయంలో తెలివిగా ఆలోచిస్తారు. ప్రతి విషయంలో కూడా సహనంతో ఉండటంతో పాటు తన చుట్టు శాంతిని కోరుకుంటూ ఉంటారు. వీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలని కోరుకుంటారు. అంటే రూల్స్ విషయంలో పక్కాగా ఉంటారు. తాము రూల్స్ బ్రేక్ చేయకుండా ఇతరులు కూడా చేయనివ్వకుండా చూసుకుంటూ ఉంటారు. ప్రతి పని కూడా శుభ్రంగా ఉండాలనుకోవడంతో పాటు ప్రతిది కూడా సక్రమంగా సాగాలని ఆశ పడుతూ ఉంటారు. నిర్ణయం తీసుకునే సమయంలో కాస్త సమయం తీసుకున్నా కూడా ఆ తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. పని ఒత్తిడి ఉన్న సమయంలో వీరు విసుక్కోవడం మరియు కసురుకోవడం చేస్తూ ఉంటారు. ఈ గ్రూప్ వారి పట్ల నమ్మకంను పెట్టుకోవచ్చు. ప్రముఖులైన జార్జి బుష్… హిట్లర్ లది ఇదే బ్లడ్ గ్రూప్.

‘బి’ బ్లడ్ గ్రూప్…
వీరు నిర్ణయాలు తీసుకోవడంలో ఎ గ్రూప్ వారి కంటే చాలా స్పీడ్ గా ఉంటారు. తమ క్రియేటివిటీతో అద్బుతాలను ఆవిష్కరిస్తూ ఉంటారు. ఇతరులు ఆదేశించిన పనులను సక్రమంగా చేయకున్నా తాము అనుకున్న పనుల విషయంలో మాత్రం వారికి పూర్తి అవగాహణ ఉండి ఆ పనిని సమర్థవంతంగా చేస్తారు. ఒకసారి నిర్ధేశించుకున్న లక్ష్యంను చేరుకోవడానికి వీరు మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరు సాధ్యపడటం లేదు అంటూ వదిలేసే రకం కాదు. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ చివరి వరకు పోరాటం సాగించి విజయంను దక్కించుకుంటారు. వీరి మనస్థత్వం ఎప్పుడు కూడా ది బెస్ట్ కోరుకుంటూ ఉంటుంది. ప్రపంచంలోనే ది బెస్ట్ కావాలని.. అందరితో ది బెస్ట్ అనిపించుకోవాలని వీరు ఉవ్విల్లూరుతు ఉంటారు. ఎదుటి వారి గురించి చాలా స్పీడ్ గా ఒక అంచనాకు రావడంలో వీరికి వీరే సాటి అనడంలో సందేహం లేదు. స్నేహితుల ఎంపిక విషయంలో వీరు చాలా ఆలోచిస్తారు. అయినా కూడా వెంటనే నిర్ణయం తీసుకుని స్నేహితులుగా మార్చేసుకుంటారు. వీరికి కొన్ని సందర్బాల్లో స్వార్థం ఎక్కువగానే ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ వారు స్వార్థంగా ఉండటం వల్ల వారికి సమాజంలో కొన్ని సార్లు చెడ్డ పేరు వస్తుంది. కాని వారు మాత్రం స్వార్థంతో విజయాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రముఖుల్లో విన్స్ యంగ్.. జాక్ నిల్సన్.. డికాప్రియో లది ఈ గ్రూపే.

‘ఎబి’ బ్లడ్ గ్రూప్…
ఈ గ్రూప్ వారి మనస్థత్వం విభిన్నగా ఉంటుంది. కొన్ని సార్లు ఎ బ్లడ్ గ్రూప్ వారి మాదిరిగా ప్రవర్థిస్తే కొద్ది సేపట్లోనే బి గ్రూప్ వారి మాదిరిగా ప్రవర్తిస్తూ వారి తీరుగా ఆలోచన చేయడం గమనించ వచ్చు. చిన్న చిన్న విషయాలకు మొహమాట పడుతూ కొన్ని సందర్బాల్లో గందరగోళ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీరి మనస్థత్వం ఎదుటి వారికి వెంటనే అర్థం కాదు. కాని వీరు మాత్రం ఎదురుగా ఉన్న వారిని చాలా ఈజీగా అర్థం చేసుకుని వారికి తగ్గట్లుగా నడుచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ గ్రూప్ వారు అందంగా ఉండటం మాత్రమే కాకుండా ఆకర్షించే విధంగా మాట్లాడటం కూడా గమనించవచ్చు. కొన్ని విషయాలను లైట్ తీసుకుంటారు. ఎక్కువగా లోతుగా వీరు ఆలోచించేందుకు ఆసక్తి చూపించరు. కొన్ని విషయాలను అసలు పట్టించుకునేందుకు కూడా ఆసక్తి చూపించరు. ఇతరులతో పోల్చితే వీరు చాలా వేగంగా తమ మనసుతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ నిర్ణయాల వల్ల ఎలాంటి ఫలితం వచ్చినా కూడా ముందుకు పోయేందుకు గుండె ధైర్యంను కలిగి ఉంటారు. ఇతరులను కన్ఫ్యూజ్ చేసే విధంగా వీరు మాట్లాడుతూ ఉంటారు. ప్రముఖుల్లో ఒబామా.. జాకీ చాన్ ఇంకా కొందరిది ఇదే గ్రూప్.

‘ఒ’ బ్లడ్ గ్రూప్..
ఈ బ్లడ్ గ్రూప్ వారు చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. వీరు చాలా స్పేచ్చగా ఉండేందుకు ఆశ పడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఒకరి కింద బానిస బతుకును ఇష్టపడరు. ప్రతి మూమెంట్ ను చాలా ఆనందంగా గడిపేందుకు గాను ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా ధైర్యంగా ఉంటారు. నాయకత్వ లక్షణాలను కలిగి ఉండటంతో పాటు ఎదుటి వారిని గద్దించి మాట్లాడే సత్తా ఉంటుంది. ఈ గ్రూప్ వారు అన్ని విషయాల్లో కూడా చాలా ఉదారంగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క సమస్య పట్ల అవగాహణ పెంచుకుంటూ వాటిని పరిస్కరించేందుకు మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. తమకు తాము రూల్స్ పెట్టుకుని వాటిని ఫాలో అయ్యేందుకు కష్టపడుఊ ఉంటారు. వీళ్లని వారియర్స్ అని పిలవడం లో ఎలాంటి తప్పు లేదు అనిపిస్తూ ఉంటుంది. వీరికి తప్పు చేసే వాళ్లంటే అబద్దాలు చెప్పే వారంటే అస్సలు ఇష్టముండదు. ప్రముఖుల్లో క్వీన్ ఎలిజబెత్.. రొనాల్డ్ రీగన్ ఇంకా పలువురిది ఇదే బ్లడ్ గ్రూప్.