శర్మాగాళ్ బోల్డ్ అండ్ క్లాసిక్ లుక్

0

చిరుత ఫేం నేహాశర్మ సోదరి ఐషా శర్మ స్పీడ్ గురించి పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో తన సోదరి నేహాతో కలిసి నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో స్పెషల్ ట్రీట్ ఇస్తోంది ఈ భామ. ఐషా ఇంతకుముందు సైక్లిస్ట్ కం రేసర్ గానూ తనని తాను పరిచయం చేసుకుంది. ఆ ఫోటోలన్నీ అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఇటీవలే ప్రఖ్యాత కోలాబ్రాండ్ కి ప్రమోషన్ చేశారు సిస్టర్స్. అందుకు సంబంధించిన వీడియో అగ్గి రాజేసింది.

తాజాగా ఐషా శర్మ ఓ యూనిక్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది. క్లాసీ లుక్ కానీ బోల్డ్ అప్పియరెన్స్ తో కుర్రకారు గుండెల్ని చిల్ చేసింది ఈ బ్యూటీ. డిజైనర్ డ్రెస్ సెలెక్షన్ తో పాటు సింపుల్ మేకప్ తో సరికొత్త మేకోవర్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.

30 ఏజ్ ఐషా బిహారీ గాళ్. తండ్రి వృత్తి రీత్యా దిల్లీలో కుటుంబం స్థిరపడింది. అయితే నేహాశర్మ ముంబైలో మోడల్ గా రాణించాక సినీపరిశ్రమలో ప్రవేశించింది. ఆ క్రమంలోనే తన సోదరి ఐషాను రంగుల ప్రపంచానికి పరిచయం చేసింది. కానీ సిస్టర్స్ కెరీర్ వెలుగులు అంత సులువుగా స్పీడ్ అందుకోలేదు. ఓవైపు మోడల్స్ గా రాణిస్తూనే సినీ ఇండస్ట్రీలో పెద్దగా వెలగాలని కలలుగంటున్నారు. ఆ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఐషా శర్మ చేయని ప్రయత్నం లేదు. కానీ ఇటీవల ఆఫర్లు తగ్గాయి.