ఏపీలో ముగ్గురు మంత్రులు ఔట్

0

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ల్యాండ్ సైడ్ విక్టరీ అందుకున్నారు. ఒంటిచేత్తో 151మంది ఎమ్మెల్యేలను 22మంది ఎంపీలను గెలిపించడంతో టీడీపీకి దిమ్మదిరిగి బొమ్మ కనపడింది. ఇంతటి ఏకపక్ష విజయం ఏపీ చరిత్రలోనే లేదని చెబుతుంటారు. టీడీపీ ఆల్ మోస్ట్ కోమాలోకి పోయింది. ఏమి చేయాలో అని అర్థం కాని రీతిలో జగన్ టీడీపీకి గట్టి షాక్ ఇచ్చారు.

ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు జగన్ ను సీఎం చేయాలని చెమటోడ్చి పనిచేశారు. టీడీపీకి బలం ఉన్న చోట కూడా వైసీపీ అభ్యర్థులు వీక్ గా ఉన్న కూడా బాగా మెజారిటీ వచ్చింది. అయితే ఇంత మెజారిటీ వచ్చిన తరువాత అన్ని కులాలకు ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తూ సీఎం జగన్ యువతను మంత్రి వర్గంలో చేర్చుకున్నారు.

మంత్రి పదవులు ఇచ్చేటప్పుడే ‘జాగ్రత్తగా పనిచేయండి.. ఏవైనా అవినీతి ఆరోపణలు నిరూపితం అయితే మాత్రం తక్షణమే బర్తరఫ్ చేస్తా.. అలాగే రెండున్నర సంవత్సరాల తరువాత 90శాతం మందిని మార్చేస్తా.. దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి’ అని జగన్ అందరికీ హెచ్చరికలు పంపారు.

చాలా మందిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలంటే రెండున్నర సంవత్సరాల తర్వాత మార్చాల్సిందేనని జగన్ నిర్ణయించుకున్నారు. అందుకే ముందుగానే ఈ విషయం మంత్రులకు చెప్పారు. . వాళ్లు కూడా ముందు మంత్రి పదవులు వస్తే చాలు అని తలఊపారు.

కానీ ఇప్పుడు ఆరుగురు మంత్రుల మీద ఆరోపణలు వస్తున్నాయట.. సీఎం జగన్ ఇంటెలిజెన్స్ ద్వారా నిఘా పెట్టగా నిరూపణ అయ్యిందని.. వారిలో ముఖ్యంగా ముగ్గురు మంత్రుల మీద వేటు పడాలని సంకేతాలు ఇచ్చారని సీఎం ఆఫీస్ దగ్గర.. సచివాలయంలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇవి ఎంతమాత్రం నిజమో త్వరలో తెలుస్తుంది.

కరోనా అయిపోయిన తరువాత మంత్రి వర్గం కూర్పు ఉంటుందని.. మిగతా మంత్రులకు కూడా ఒక హెచ్చరిక ఉంటుందని కూడా అనుకుంటున్నారట.. ఏది ఏమైనా కొందరు మంత్రుల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయని కూడా అంటున్నారు. సీఎం ఏమీ నిర్ణయమైనా కరోనా అయిపోయిన తరువాత ఉంటుందని అంటున్నారు. మరి ఇది నిజమా కాదు.. తెలియాల్సి ఉంది.