కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని టార్గెట్ చేస్తూ కంగనా ట్వీట్స్…!

0

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ – మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. కంగనా కార్యాలయాన్ని అక్రమ నిర్మాణమంటూ మహా ప్రభుత్వం కూల్చివేయడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై అలాగే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పై ఆమె పోరాటానికి సిద్ధమైంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా మహా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్న కంగనా రనౌత్.. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఉద్దేశించి ఘాటైన ట్వీట్స్ చేశారు.

“ప్రియమైన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గారు.. ఓ మహిళగా ఉండి మహారాష్ట్రలో ఉన్న మీ ప్రభుత్వం సాటి మహిళను ఇబ్బందులు పెడుతుంటే మీకు వేదన కలగడం లేదా?అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన రాజ్యాంగంలోని సూత్రాలను పాటించాలని మీ ప్రభుత్వానికి మీరు చెప్పలేరా? విదేశాల్లో పెరిగిన మీరు ప్రస్తుతం భారతదేశంలో నివస్తున్నారు. మహిళల పోరాటాల గురించి మీకు తెలిసి ఉండవచ్చు. మీ నిశ్శబ్దాన్ని అసమాన్యతను చరిత్ర నిర్ణయిస్తుంది. మొత్తం లా అండ్ ఆర్డర్ ను ఉపయోగించి మీ ప్రభుత్వం ఓ మహిళను ఇబ్బందులకు గురి చేస్తుంది. మీరు జోక్యం చేసుకుంటారని అనుకుంటున్నాను” అని కంగనా ట్వీట్ చేసింది.

”శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరే నాకెంతో ఇష్టమైన ఆరాధ్యమైన వ్యక్తి. ఏదో ఒకరోజు శివసేన పార్టీ కాంగ్రెస్ పార్టీతో గ్రూపు కడుతుందేమోనని ఆయన భయపడ్డారు. ఈ రోజు తన పార్టీ పరిస్థితిని చూస్తే అతని ఫీలింగ్ ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది. దీనికి బాల్ థాకరే వీడియో ఒకటి జత చేసింది. మొత్తం మీద ఈ ట్వీట్స్ తో కంగనా అటు సోనియా గాంధీని ఇటు శివసేన ప్రభుత్వాన్ని ప్రశ్నించారని చెప్పవచ్చు.