చెప్పుతో కొట్టినట్టు.. ఏంటయా ఆ పురస్కారం?

0

జాతీయ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పేరు అర్నబ్ గోస్వామి. రిపబ్లిక్ టీవీ నిర్వహణలో కీలక భూమిక పోషిస్తున్న అర్నబ్ వాగ్ధాటికి ఎవరైనా డంగైపోవాలి. ఈయన ప్రస్తుతం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నారు. అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీకి అత్యంత అనుకూల మీడియాగా పేరున్న రిపబ్లిక్ టీవీని రన్ చేస్తున్న అర్నబ్ పై గత కొంత కాలంగా కాంట్రవర్సీలు వెలుగులోకి వస్తూనే వున్నాయి.

తను మాత్రమే దేశ భక్తుడిగా అభివర్ణించుకునే అర్నబ్ గోస్వామి తనకు నచ్చని వారిపై విరుచుకుపడుతుంటాడు. తన ఛానల్ లో జరిగే చర్చల్లో తనకు నచ్చిన వారికి మాత్రమే మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తూ నచ్చని వారిని లైవ్ లోనే ఏకిపారేస్తుంటాడు. అర్నబ్ నోటికి భయపడి చాలా మంది ముదుర్లే నోరెళ్లబెడుతుంటారంటే అతని దాడి ఏ స్థాయిలో వుంటుందో లైవ్ చూసిన వాళ్లకి విదితమే. ఇతనితో పెట్టుకోవడానికి రాజకీయ నాయకులు.. సినీ సెలబ్రిటీలు వెనకడుగు వేస్తుంటారు. రియా- సుశాంత్ ల వివాదాన్ని అర్నబ్ మరింత రచ్చగా మార్చిన విషయం తెలిసిందే.

అలాంటి అర్నబ్ నే ఓ బాలీవుడ్ దర్శకుడు టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ లో వర్మ తరువాత అత్యంత వివాదాస్పద దర్శకుడిగా పేరున్న అనురాగ్ కశ్యప్ గురువారం రిపబ్లిక్ టీవి చానల్ ముందు బ్లాక్ చెప్పుని ఓ ఫ్రేమ్ లో జతచేసి ఓ ఫొటో ఫ్రేమ్ ని లామినేట్ చేసి అర్నబ్ గోస్వామికి జర్నలిజంలో లభించిన పురస్కారంగా ప్రదర్శించడం సంచలనంగా మారింది. అతనితో కలిసి కమెడియన్ కునాల్ కమ్రా వైట్ చెప్పుని ఓ ఫ్రేమ్లో చేర్చి గిప్ట్ గాచేర్చి జతకలవడం ఆసక్తికరంగా మారింది. ముంబైలోని రిపబ్లిక్ చానల్ ముందు ఈ లామినేషన్ ఫ్రేమ్ లతో హంగామా చేశారు. సెక్యూరిటీ అడ్డుకోవడంతో అక్కడ ఫొటోలకు పోజులిచ్చారు. వాటినే సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.