Templates by BIGtheme NET
Home >> Telugu News >> రష్యాతో కుదిరిన ‘ఆయిల్ డీల్ ‘

రష్యాతో కుదిరిన ‘ఆయిల్ డీల్ ‘


రష్యాతో మన దేశానికి ఆయిల్ డీల్ కుదిరింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో తన దగ్గరున్న చమరు నిల్వలను డిస్కౌంట్ ధరలకే అమ్ముతామంటూ రష్యా చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. 3.5 మిలియన్ బ్యారెళ్ళ చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకోవటానికి కేంద్రం ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయంగా ఉన్న చమురు ధరలతో పోల్చితే 50 శాతం డిస్కౌంట్ ధరలకే అందిస్తానని రష్యా ఆఫర్ ఇవ్వటంతో కేంద్రం కూడా ఓకే చెప్పింది.

నిజానికి రష్యా నుండి మనకు దిగుమతి అవుతున్న చమురు కేవలం ఒక్క శాతం మాత్రమే. మిగిలిన చమురునంతా కేంద్రం గల్ఫ్ దేశాలు అమెరికా తదితర దేశాల నుండే కొంటుంది. అయితే ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా అనేక రకాల ఆంక్షలు విధించింది. దీని ఫలితంగా రష్యాపై ఆర్థిక ఒత్తిళ్ళు పెరిగిపోతున్నది. ఈ ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు రష్యా తన దగ్గరున్న చమురును బాగా తగ్గింపు ధరలకే అమ్మేస్తానని మనకు ఆఫరిచ్చింది.

ప్రస్తుతం రష్యాకు డాలర్లు అందటం లేదు. అందుకనే చమురును కొనుగోలు చేసే దేశాలపైన రష్యా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే భారత్ కు ఆఫరిచ్చింది. చమురు కొనుగోళ్ళు రూపాయి లేదా రూబుల్ కరెన్సీలో చెల్లింపులు చేసుకునేందుకు కూడా రష్యా ఒకే చెప్పిందట. కేంద్రం గనుక రూబుల్స్ లో చెల్లింపులు చేస్తే దాన్ని చైనాకు ట్రేడింగ్ చేసుకుని అక్కడ నుండి డాలర్లను సంపాదించుకోవాలన్నది రష్యా ఆలోచన. ఒకవేళ రూబుల్స్ లో చెల్లింపులు చేసినా రష్యాకు ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదు. దాన్నే చైనాలో ట్రేడింగ్ చేసుకుంటుంది.

భారత్-రష్యా మధ్య కుదిరిన ఒప్పందంపై అమెరికా మండిపోతోంది. రష్యాతో ఒప్పందాలు చేసుకోవటం ఆంక్షల ఉల్లంఘన కిందకు రాదని అంటునే తన నిర్ణయంపై భారత్ పునరాలోచించాలని అమెరికా కోరుతోంది. అయితే ప్రస్తుత చమురు ధరలో సగానికే రష్యా మిలియన్ బ్యారెళ్ళు అందిస్తానని ఆఫర్ ఇస్తే ఎవరూ కాదనరు. అందుకనే మనదేశం కూడా ఓకే చేసింది.