Templates by BIGtheme NET
Home >> Telugu News >> టెస్టోస్టిరాన్ తక్కువైతే కరోనా ముప్పు ఎక్కువైనట్టే !

టెస్టోస్టిరాన్ తక్కువైతే కరోనా ముప్పు ఎక్కువైనట్టే !


పురుష హార్మోన్ గా ప్రాచుర్యం పొందిన టెస్టోస్టిరాన్ స్థాయులకు కరోనాకు సంబంధం ఉందా అనే విషయం లో మిలన్ (ఇటలీ)లోని ‘శాన్ రఫెల్ యూనివర్సిటీ హాస్పిటల్ పరిశోధకులు సంబంధం ఉందని సమాధానం చెప్తున్నారు. టెస్టోస్టిరాన్ స్థాయులు తక్కువా ఉన్న పురుషులకు వైరస్ సోకి లక్షణాలు గనక కనిపిస్తే వారు తీవ్రంగా జబ్బు పడే ప్రమాదం చనిపోయే ముప్పు ఆరు రెట్లు పెరుగుతుందని హెచ్చరికలు చేస్తున్నారు. టెస్టోస్టిరాన్ స్థాయులు ఎంత తక్కువగా ఉంటే ఇంటెన్సివ్ కేర్ చికిత్స వెంటిలేటర్ చికిత్స అవసరమయ్యే ముప్పు అంతగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారు ఎక్కువ రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని తెలిపారు.

ఈ అధ్యయనంలో భాగంగా వారు 286 మంది పురుష కరోనా పేషెంట్లను.. 305 మంది ఆరోగ్యవంతులైన పురుషులతో పోల్చిచూశారు. గత ఏడాది ఫిబ్రవరి మే మధ్యన ఈ అధ్యయనం కొనసాగింది. అందులో పాల్గొన్న కరోనా పేషంట్లలో 90ు మందిలో టెస్టోస్టిరాన్ స్థాయులు 9.2 నానోమోల్స్ పర్ లీటర్ కన్నా తక్కువ ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఆరోగ్యవంతులైన పురుషులతో పోలిస్తే ఆ మోతాదు కేవలం 17% మాత్రమే కావడం గమనార్హం. 3 నుంచి 4 నానోమోల్స్ పర్ లీటర్ ఉన్న పేషెంట్లు కొద్దిపాటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరితే 0.7 నుంచి 1 నానోమోల్ పర్ లీటర్ ఉన్నవారికి ఐసీయూ చికిత్స అవసరమైంది. వారిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ మహమ్మారి వచ్చిన కొత్తల్లో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఆస్పత్రిలో చేరడం తీవ్రంగా జబ్బుపడడాన్ని గమనించారని తెలిపారు. దీనితో కరోనా ఇన్ఫెక్షన్ కు పురుష హార్మోన్ల స్థాయులకు ముఖ్యంగా టెస్టోస్టిరాన్ స్థాయులకు మధ్య సంబంధం ఉందని భావించినట్టు తెలిపారు. కానీ ఇంతగా సంబంధం ఉంటుందని అస్సలు ఊహించలేదు అని ఈ పరిశోధనలో పాల్గొన్న యూరాలజిస్టు ప్రొఫెసర్ ఆండ్రియా సలోనియా తెలిపారు.

తన పాతికేళ్ల వృత్తి జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదన్నారామె. కాగా.. ఈ పరిశోధనలో వారు గమనించిన పేషెంట్లకు ముందు నుంచే తక్కువ టెస్టోస్టిరాన్ ఉందా? లేక కొవిడ్ వల్ల తగ్గిందా? అనే విషయంపై స్పష్టత లేదు. ఒక్కటి మాత్రం స్పష్టంటెస్టోస్టిరాన్ మగవారిని ఈ కరోనా ఇన్ఫెక్షన్ బారి నుంచి కాపాడడంలో కీలకపాత్ర పోషిస్తోంది. అయితే వైరస్ కి కూడా టెస్టోస్టిరాన్ స్థాయులను తగ్గడానికి కారణం కావొచ్చు. దానివల్ల పురుషులకు ప్రమాదం పెరుగుతోంది అని సలోనియా వివరించారు. మరోవైపు కరోనా ముప్పును ఎదుర్కోవడంలో స్త్రీ పురుషుల శరీరాల్లోని రోగనిరోధక వ్యవస్థలు భిన్నంగా స్పందిస్తున్నాయని యేల్ వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. కరోనా సోకిన వారిని ఆరోగ్యవంతులను ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించగా కరోనా బారిన పడ్డ పురుషుల్లో కైన్యూరెనిక్ యాసిడ్ స్థాయులు ఎక్కువగా ఉండడం గుర్తించారు. మహిళల కన్నా పురుషులపైనే కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోందని మృతుల్లోనూ మగవారే అధికంగా ఉంటున్నారని వివిధ పరిశీలనల్లో స్పష్టమయ్యింది. అయితే ఇందుకు పురుషుల్లో ప్రత్యుత్పత్తికి దోహదపడే టెస్టోస్టిరాన్ హార్మోన్ అధికంగా ఉండటమే కారణమని కొందరు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకూ భావిస్తూ వచ్చారు టెస్టోస్టిరాన్ తక్కువైతే కొవిడ్ ముప్పు అధికమే!మహిళల కన్నా పురుషులపైనే కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోందని మృతుల్లోనూ మగవారే అధికంగా ఉంటున్నారని వివిధ పరిశీలనల్లో స్పష్టమయ్యింది. అయితే ఇందుకు పురుషుల్లో ప్రత్యుత్పత్తికి దోహదపడే టెస్టోస్టిరాన్ హార్మోన్ అధికంగా ఉండటమే కారణమని కొందరు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకూ భావిస్తూ వచ్చారు. పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గినప్పుడు పురుషుల్లో కామేచ్ఛ(లిబిడో)తగ్గుతుంది.