ధోనీ నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్.. జోస్ బట్లర్ షాక్

0

తన అభిమాన క్రికెటర్ నుంచి ఊహించని గిఫ్ట్ దక్కడంతో రాజస్థాన్ రాయల్స్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ షాక్కు గురయ్యారట. సోమవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై.. రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ జట్టు స్టార్ ఆటగాడు జోస్ బట్లర్కు ఎంఎస్ ధోని నుంచి ఊహించని బహుమతి లభించింది. తన 200 వ ఐపీఎల్ మ్యాచ్ జెర్సీ ని బట్లర్ కు ఇచ్చాడు ధోని. ప్రపంచ వ్యాప్తం గా ధోనీ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందులో బట్లర్ ఒకడు.

తన ఫేవరెట్ క్రికెటరే కాకుండా ఆరాధ్య క్రికెటర్ ధోనీ అంటూ గతంలో చాలా సార్లు చెప్పాడు బట్లర్. నిన్నటి మ్యాచ్లో బట్లర్ 48 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్లతో అజేయంగా 70 పరుగుల సాధించి రాజస్థాన్ను గెలిపించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్న బట్లర్కు ధోనీ నుంచి కూడా గిఫ్ట్ లభించింది. అది కూడా ధోని ప్రతిష్టాత్మక మ్యాచ్ లో వేసుకున్న జెర్సీ కావడంతో బటర్ల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన ఐడల్ క్రికెటర్ నుంచి జెర్సీని అందుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉన్నదని బట్లర్ ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ కు క్రికెట్ అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.