Templates by BIGtheme NET
Home >> Telugu News >> భారత్‍ లోకి కొత్త రకం వైరస్..యూకే నుండి వచ్చినవారిలో 8 మందికి పాజిటివ్!

భారత్‍ లోకి కొత్త రకం వైరస్..యూకే నుండి వచ్చినవారిలో 8 మందికి పాజిటివ్!


బ్రిటన్ లో విలయతాండవం చేస్తున్న కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. బ్రిటన్ లో కొత్త రకం కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ 70 శాతం వేగంగా వ్యాపిస్తోందని బ్రిటన్ తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్ సహా ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే యూకే నుండి వచ్చే విమానాల్ని నిషేధించింది.

అయితే యూకే కొత్త రకం వైరస్ ఇప్పటికే భారత్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. యూకే నుంచి భారతదేశానికి వచ్చిన 8 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఐదుగురికి కోల్ కతాలో ఇద్దరికి చెన్నైకి ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఇది కరోనా కొత్త స్ట్రెయిన్ అవునో కాదో తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. ఇక శాంపిళ్లను ల్యాబ్ లో పరిశోధనకు పంపించారు.

గత రాత్రి యూకే నుంచి ప్రయాణికులు భారత్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. భారత్ లోకి కరోనా కొత్తరకం వైరస్ పాజిటివ్ కేసులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అప్రమత్తం అయ్యాయి. యూకే సహా ఇతర దేశాల నుంచి వచ్చేవారిని టెస్టులు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. ఈ కరోనా కొత్త రకం వైరస్ చిన్నారుల్లో తొందరగా సోకే ప్రమాదం ఉందంటున్నారు సైంటిస్టులు.. ‘VUI-202012/01’ పేరుతో కరోనా వైరస్ వేరియంట్ యూకేలో విజృంభిస్తోంది