Templates by BIGtheme NET
Home >> Telugu News >> అంబానీ కేసు: సీన్ రీక్రియేషన్ కి సిద్దమైన ఎన్ ఐఏ ఏం తేలుతుందో!

అంబానీ కేసు: సీన్ రీక్రియేషన్ కి సిద్దమైన ఎన్ ఐఏ ఏం తేలుతుందో!


గత కొన్ని రోజుల క్రితం ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంటి వద్ద నిలిపి ఉంచిన వాహనంలో జిలెటిన్ స్టిక్స్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుని ప్రస్తుతం ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. తాజాగా ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. అక్కడ ఈ వాహనాన్ని పీపీఈ కిట్ ధరించిన వ్యక్తి కి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పరిశీలనగా చూసిన ఆయన స్టాఫ్ ఆ వ్యక్తి సచిన్ వాజెయే అని స్పష్టం చేశారు. ఈ కిట్ ని వాజే దహనం చేశారని తెలిసింది. ఆ వాహనంలో ఓ కిరోసిన్ బాటిల్. 5 లక్షల నగదును కూడా ఎన్ ఐ ఏ అధికారులు కనుగొన్నారు. కిట్ ధరించకముందు తాను వేసుకున్న దుస్తులను సచిన్ వాజే అదే వాహనంలో దాచారని వారు తెలుసుకున్నారు.

ఆటో పార్ట్శ్ డీలర్ అయిన మాన్ సుఖ్ హీరేన్ కి చెందిన వాహనాన్నే వాజే అక్కడ నిలిపి ఉంచారని అధికారులు అంటున్నారు. గత నెల హీరేన్ థానేలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అతని మృతి కేసులోను అతని వాహనం చోరీ కేసులోనూ ఈ మాజీ పోలీసు అధికారి వాజే హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసుపై మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ మధ్య పెద్ద చర్చ జరిగింది. వాజేను సస్పెండ్ చేయాలని బీజేపీ నేత మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేయడంతో ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసి కేసు దర్యాప్తు ముగిసేవరకు మరో విభాగానికి బదిలీ చేసింది.

అతడిని రక్షించేందుకు శివసేన ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలను స్వయంగా సీఎం ఉధ్దవ్ థాకరే తొసిపుచ్చారు. కాగా మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ తో బాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) కూడా అతడిపై వచ్చిన ఆరోపణలపై ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఈ సంస్థ అధికారులు ఆయనను అరెస్టు చేసి సుమారు 12 గంటల పాటు విచారించారు. కాగా ఈ నెల 25 వరకు అతడిని ఎన్ ఐ ఎ కస్టడీకి రిమాండ్ చేస్తూ ముంబై కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీన్ రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. వాజేను పీపీఈ కిట్ ధరింపజేసి ఐదుగురు స్వతంత్ర సాక్షుల మధ్య సీన్ రీక్రియేట్ చేసేందుకు సిద్ధమైంది.