Templates by BIGtheme NET
Home >> Telugu News >> దేశంలోకి కరోనా వచ్చి ఏడాది పూర్తి

దేశంలోకి కరోనా వచ్చి ఏడాది పూర్తి


ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించి సరిగ్గా ఏడాది పూర్తయింది. గతేడాది జనవరి 30న భారత్ లో తొలి కరోనా కేసు నమోదైంది. ఇక అక్కడ నుంచి కేసుల పరంపర విపరీతంగా పెరిగింది. సరైన సమయంలో విదేశీ ప్రయణాలు నిలుపదల చేయకపోవడంతో కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్క కేసుతో మొదలై.. ఒకే రోజు దాదాపు 98వేల కేసులు నమోదయ్యాయంటే ఈ మహమ్మారి ఎంతగా వ్యాపించిందో అర్థమవుతోంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 1,07,33,131 కేసులు నమోదు కాగా.. 1.54 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

గత 24 గంటల్లో కొత్తగా 13,083 మందికి కరోనా సోకింది. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇది 30 శాతం తక్కువ కావడం గమనార్హం. గత కొన్ని రోజులుగా కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97 శాతానికి చేరువైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం వ్యాక్సిన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. జనవరి 16న టీకా కార్యక్రమం ప్రారంభించగా.. ఇప్పటివరకు 35 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్రం వెల్లడించింది.