Templates by BIGtheme NET
Home >> Telugu News >> కరోనా తగ్గాక తీసుకోవాల్సిన ఆహారం ఇదే..

కరోనా తగ్గాక తీసుకోవాల్సిన ఆహారం ఇదే..


Pandemic recovered patients should take Vitamin C

Pandemic recovered patients should take Vitamin C

కరోనా బారిన పడి తిరిగి కోలుకున్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి.. అనే విషయంలో ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఏది తినాలో తెలియక పొట్ట నిండా ఆహారం కురుకుంటున్నారు. చివరికి జీర్ణం కాక అవస్థలు పడుతున్నారు. అలా కాకుండా రోజంతా మితంగానే పౌష్టికాహారం తీసుకుంటే మేలని వైద్యులు చెబుతున్నారు. సరైన పద్ధతిలో పోషకాహారం తీసుకుంటే తొందరగా రికవరీ అవొచ్చు. శక్తినిచ్చే పిండి పదార్థాలు కొవ్వులు మాంసకృత్తులు విటమిన్లు ఖనిజాలు సరిపడా తీసుకుంటేనే తొందరగా కోలుకోవచ్చు. ఉదయం సాయంత్రం తప్పనిసరిగా పాలు తీసుకోవాలి. అల్పాహారంగా రాగి మాల్ట్ మొలకెత్తిన గింజలు తీసుకోవచ్చు. ఉడికించిన గుడ్డు రోజుకు కనీసం రెండు సార్లు తీసుకోవడం మేలు. కరోనా బారిన పడని వారికి కోలుకున్న వారికి విటమిన్ సి ఎంతో కీలకం. అందుకే సిట్రస్ జాతి పండ్లు అయిన నిమ్మ ఆరెంజ్ ను కచ్చితంగా తీసుకోవాలి. విటమిన్ సి లభించే క్యాప్సికం బ్రోకోలి క్యారెట్ పుట్టగొడుగులు ఆహారంలో చేర్చుకోవాలి. వేడి నీళ్లలో తేనె నిమ్మరసం వేసి తీసుకుంటే సమృద్ధిగా విటమిన్ సి లభిస్తుంది.

మధ్యాహ్న భోజనంలో రొట్టె చేర్చాలి. పప్పు ఆకుకూరలు విటమిన్ సి లభించే కూరగాయలు చికెన్ చేప తీసుకోవచ్చు. సాయంత్రం సమయంలో స్నాక్స్ గా ఉడికించిన పల్లీలు శనగలు వేయించిన బఠానీలు నానబెట్టిన బాదం బొబ్బర్లు అలసందలు పెసలు తీసుకోవచ్చు. ఈ పప్పు ధాన్యాలతో శక్తితో పాటు ప్రోటీన్లు ఐరన్ జింక్ వివిధ విటమిన్లు లభిస్తాయి. గుమ్మడి గింజలతో అధికంగా జింకు పొందొచ్చు. నీరసంగా ఉన్నవారు మాంసకృత్తులు అధికంగా లభించే నువ్వులను బాగా వాడాలి. నువ్వులతో చేసే పచ్చళ్లతో పాటు బెల్లంతో నువ్వుల ఉండలు చేసుకొని ఆహారంగా తీసుకోవచ్చు. రక్తహీనతకు నువ్వులతో చెక్ పెట్టొచ్చు. ఎండు ఖర్జూరం ఎండు ద్రాక్ష తీసుకోవడం కూడా మేలే. ఆకుకూరల్లో పాలకూర ఎంతో ప్రయోజనకారి. విటమిన్ సి ఉండే పండ్లు కీవి బొప్పాయిని తీసుకోవాలి. ఇలాంటి బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే కరోనా బారిన పడ్డవారు తొందరగా కోలుకోవచ్చు. వీటన్నింటికంటే కీలకమైనది సమయానికి తినడం సరిపడా నిద్ర అత్యావకశ్యం.