బ్యాంకు భారీ తప్పిదం…రెవ్లాన్ ఖాతా నుంచి రూ .6 700 కోట్లు ఇతర ఖాతాల్లోకి

0

The bank made a huge mistake

The bank made a huge mistake

‘గోరుచుట్టుపై రోకలిపోటు అంటే ఇదేనేమో’.. కరోనా సంక్షోభం కారణంగా భారీ నష్టాల్లో కూరుకుపోయిన సౌందర్య ఉత్పత్తుల కంపెనీ రెవ్లాన్ న్యూయార్క్ సిటీ బ్యాంక్ చేసిన చిన్న తప్పిదానికి భారీ నష్టాల్లో కూరుకుపోయింది. సిటీ బ్యాంక్ చేసిన పనికి రెవ్లాన్ ఖాతాలోని రూ. 6700 కోట్లు రుణ దాతల ఖాతాల్లోకి జమ అయ్యాయి. ఈ సంఘటనతో రెవ్లాన్ భారీగా నష్టాల్లో కూరుకుపోయింది. కరోనా సంక్షోభం కారణంగా రెవ్లాన్ ఇప్పటికే నష్టాలు మూటగట్టుకుంది.

సుమారు బిలియన్ డాలర్ల మేర అప్పుల్లో చిక్కుకుంది. అప్పు తీర్చక పోవడంతో రుణాలు ఇచ్చిన వారు తామిచ్చిన సొమ్ము వెనక్కు ఇప్పించాలని న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సిటీ బ్యాంకు క్లరికల్ గా చేసిన తప్పిదం కారణంగా రెవ్లాన్ ఖాతా నుంచి 900 మిలియన్ డాలర్లు రెవ్లాన్ కు అప్పు ఇచ్చిన వారి ఖాతాల్లో పడ్డాయి. ఆ డబ్బు రికవరీకి సిటీ బ్యాంకు ప్రయత్నిస్తుండగా.. రుణ దాతలు ససేమిరా తిరిగి ఇవ్వమని అంటున్నారు. తాము ఇచ్చిన మొత్తానికి తమ ఖాతాల్లో పడ్డ సొమ్ము వడ్డీతో సహా సరిపోయిందని కొందరు రుణదాతలు అంటున్నారు. మరి కొందరు తిరిగి ఇస్తున్నా మెజారిటీ రుణ దాతలు సొమ్ము తిరిగి ఇచ్చేందుకు సమ్మతించడం లేదు. కరోనాతో వ్యాపారం లేక అప్పుల్లో ఉన్న రెవ్లాన్ కి ఇది పిడుగు లాంటి వార్తే. అయితే ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తమ సొమ్మును సిటీ బ్యాంకులో పెట్టామని తిరిగి తమ సొమ్ము ఎంతుంటే అంత చెల్లించాల్సిందేనని రెవ్లాన్ ప్రతి నిధులు చెబుతున్నారు.