ఎదురుగా కోట్ల ఆస్తి.. కానీ.. తీసుకోలేని ఆ యువకుడి దైన్యస్థితి..!

0

పూరి-రవితేజ సినిమా ‘దేవుడు చేసిన మనుషులు’లో ఆలీపై ఓ సన్నివేశం ఉంటుంది. డబ్బు, నగలు మూట ఎదురుగా ఉన్నా తీసుకోలేడు. మనిషి దురదృష్టానికి పరాకాష్టగా నిలిచే ఆ సన్నివేశం చూస్తే నవ్వొస్తుంది కానీ.. నిజజీవితంలో ఓ వ్యక్తి కళ్లెదురుగా ఉన్న కోట్ల సొమ్మును తీసుకోలేక నలిగిపోతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. వాషింగ్టన్ లో ఉంటున్న స్టీఫెన్ ధామస్ అనే ప్రోగ్రామర్‌ బిట్‌కాయిన్ తక్కువ ధర ఉన్నప్పుడు 7000 బిట్ కాయిన్స్ కొన్నాడు. వాటిని భద్రంగా ఓ స్ట్రాంగ్ రూమ్ లో పాస్‌వర్డ్‌తో భద్రపరుచుకున్నాడు.

అయితే.. ఇటివల బిట్ కాయిన్ విలువ 25 లక్షలు పైగా పలికింది. దీంతో ఏకంగా వాటి విలువ 1753 కోట్లకు పెరిగింది. దీంతో కోటీశ్వరుడు అయిపోయిన థామస్ ఆనందానికి హద్దుల్లేవు. అయితే ఆ ఆనందం థామస్ కు ఎక్కువసేపు నిలబడలేదు. కారణం.. స్ట్రాంగ్ రూమ్ కు పెట్టుకున్న పాస్ వర్డ్ ను మర్చిపోవడమే. పాస్‌వర్డ్ కొట్టేందుకు ఉన్న 10 చాన్సుల్లో ఇప్పటికే 8 చాన్స్‌లను వినియోగించేశాడు. మిగిలిన 2 చాన్సులను కూడా తప్పుకొడితే పర్మినెంట్ గా ఖాతా మూసుకుపోతుంది. మరి ఏం చేస్తాడో..!