మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

0

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఆర్మీ ఆర్ అండ్ అర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన. కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు అభిజిత్ ముఖర్జీ అధికారికంగా వెల్లడించారు.

అనారోగ్యంతో ఈనెల 10న ఆస్పత్రిలో చేరిన 84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీకి మెదడులో రక్తం గడ్డ కట్టినట్టు గుర్తించిన వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఆయనకు కరోనా పాజిటివ్ గా కూడా నిర్ణారణ అయ్యింది. దీంతో అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి తాజాగా సోమవారం సాయంత్రం మరింత విషమించి ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలిసింది.