Templates by BIGtheme NET
Home >> Telugu News >> ట్రంప్ కోసం పుతిన్ రంగంలోకి దిగాడా?

ట్రంప్ కోసం పుతిన్ రంగంలోకి దిగాడా?


అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా వేడిని పెంచేస్తోంది. ప్రపంచానికి పెద్దన్న స్థానంలో ఉన్న అమెరికాకు.. అధ్యక్ష పదవిని చేపట్టటం అంటే మాటలు కాదు. దీని వెనుక ఎంతో కసరత్తు ఉంటుందన్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో కిందామీదా పడుతున్న వేళ.. వచ్చి పడిన ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు ట్రంప్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈసారికి ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని ట్రంప్ కోరుకుంటున్నారు. ఇందుకు తగ్గట్లే ఆయన ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టటం లేదు.

గత ఎన్నికల సమయంలో ట్రంప్ విజయం సాధించటంలో కీలకభూమిక పోషించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తటం తెలిసిందే. ఫలితాల వెల్లడి సందర్భంగా ఏదో జరిగిందన్న సందేహాలు భారీగానే బయటకు వచ్చాయి. ట్రంప్ తరఫున అధ్యక్ష ఎన్నికలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీ రోల్ ప్లే చేసినట్లుగా ఇప్పటికి అనుమానిస్తాయి. ఇదిలా ఉంటే.. తాజాగా జరగనున్న ఎన్నికల్లోనూ ట్రంప్ కోసం రష్యా రంగంలోకి దిగాలని యోచిస్తున్నట్లుగా నిఘా వర్గాల చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇవిప్పుడు కలకలంగా మారాయి.

ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా.. రష్యాకు మధ్య నడిచిన అధిపత్య పోరును మర్చిపోలేం. తర్వాతి కాలంలో ఆర్థికంగా రష్యా చితికిపోవటం.. అమెరికా సూపర్ పవర్ గా మారటం తెలిసిందే. పుతిన్ నాయకత్వంలో రష్యా అంతకంతకూ శక్తివంతమవుతుందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళలో.. తాజా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు సాయం చేసేందుకు రష్యా రంగంలోకి దిగిందన్న మాట నిఘా వర్గాల నుంచి వచ్చింది. ట్రంప్ కు అనుకూలంగా రష్యాతో సన్నిహిత సంబంధాలు ఉన్న కొన్ని శక్తులు వ్యవహరిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే.. చైనా మాత్రం ట్రంప్ మరోసారి ఎన్నికల్లో విజయం సాధించకూడదని బలంగా కోరుకుంటోంది.ఇందులో భాగంగా ట్రంప్ మీద ప్రజాభిప్రాయం మారేలా విమర్శల పెరిగేలా చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే నిజమైతే.. ట్రంప్ గెలుపు అవకాశాల్ని దెబ్బ తీసేలా జరుగుతున్న తాజా ప్రచారం వెనుక ఉన్నది డ్రాగన్ దేశమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.మరి.. తనపై వచ్చిన తాజా ఆరోపణపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.