Templates by BIGtheme NET
Home >> Telugu News >> నమ్మలేరు కానీ నిజం.. 60 కోట్ల ఏళ్లలో చేసే లెక్క 180 సెకన్లలో

నమ్మలేరు కానీ నిజం.. 60 కోట్ల ఏళ్లలో చేసే లెక్క 180 సెకన్లలో


చైనోవోడు.. చైనావాడే. ఆ విషయాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. అక్కడి శాస్త్రవేత్త ఒక అద్భుతాన్ని సృష్టించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా పని చేసే సూపర్ కంప్యూర్ కంటే 100 లక్షల కోట్ల (ఈ పదాల్ని జాగ్రత్తగా చదవండి) రెట్ల వేగంతో పని చేసే క్వాంటం కంప్యూటర్ ను ఆవిష్కరించాడు. దీంతో.. అద్భుతాలెన్నో ఆవిష్కృతం కానుంది. తొలిసారి కాంతి ఆధారితంగా పని చేసే ఈ కంప్యూటర్ విశేషాల గురించి తెలుసుకుంటే నోటి వెంట మాట రాని పరిస్థితి. ఈ కంప్యూటర్ గొప్పతనాన్ని ఒక్క లైన్ లో చెప్పేయాలంటే.. ఈ పోలిక సరిగ్గా సరిపోతుంది. 60 కోట్ల ఏళ్లలో పరిష్కరించే సమస్యను కేవలం మూడంటే మూడు నిమిషాల్లోనే పరిష్కరిస్తుంది.

తాజాగా ఈ అద్భుతమైన కంప్యూటర్ గురించి చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ క్వాంటం కంప్యూటర్ కు ‘‘జిజాంగ్’’ పేరు పెట్టారు. చైనా పురాతన గణిత శాస్త్రాల నుంచి ఈ పదాన్ని తీసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగమైన పుగాకు సూపర్ కంప్యూటర్ అరవై కోట్ల సంవత్సరాల్లో చేసే లెక్కల్ని ఇది కేవలం మూడు నిమిషాల్లో పరిష్కరించే వైనం చూస్తే.. ఇదెంత అద్భుతమో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సంప్రదాయ కంప్యూటర్లు.. 0.. 1 అంకెల ఆధారంగా పని చేస్తాయి. వీటిని బిట్లు అంటారు. అయితే.. చైనా తయారు చేసిన తాజా కంప్యూటర్ లో మాత్రం 0 1 కు బదులుగా కాంతి కణాల్ని (ఫోటాన్) ఉపయోగించారు. క్వాంటం కంప్యూటర్స్ లో వీటిని క్యూబిట్ లు అంటారు.

సాధారణ కంప్యూటర్లకు.. క్వాంటం కంప్యూటర్ కు తేడా ఏమిటంటే.. వాటికవే కమాండ్స్ ఇచ్చుకుంటూ పని చేస్తాయి. ఉదాహరణకు ఒక టీకాను డెవలప్ చేయాలంటే పలు ఔషధాల్ని పరీక్షించాలి. వాటి కాంబినేషన్ల చెక్ చేస్తుండాలి. వాటిని వాడటం వల్ల ఏం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలంటే కొన్ని రోజుల సమయం పడుతుంది. అయితే.. ఈ క్వాంటం కంప్యూటర్ మాత్రం అలాంటి దుష్ప్రభావాలను ముందే ఊహిస్తుంది. వాటి వల్ల కలిగే విపరిణామాల్ని ముందే చెప్పేస్తుంది.

సూపర్ కంప్యూటర్లకు.. క్వాంటం కంప్యూటర్లకు మధ్య తేడా ఏమిటన్నది చూస్తే.. ఒక క్యాలికులేషన్ కు ఒకే సమాధాన్ని ఇస్తాయి. అందుకు భిన్నంగా క్వాంటంలో భిన్న పరిష్కారాల్ని చూపిస్తాయి. సమాచార విశ్లేషణలో కీలకంగా వ్యవహరిస్తాయి. వీటిల్లో ఊహాజనిత సమస్యల పరిష్కారంలోనూ పాలుపంచుకుంటాయి. యూజర్ కమాండ్స్ ఆధారంగా పని చేస్తాయి.. క్వాంటం కంప్యూటర్లు తమకు తామే.. ఎలాంటి యూజర్ కమాండ్స్ అవసరం లేకుండానే వాటికవే క్యాలిక్యులేషన్స్ నిర్వహిస్తాయి. ఇదంతా చదువుతున్నప్పుడు ఏదో ఫిక్షన్ మాదిరి అనిపించట్లేదు?